అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రురాలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకురాలు శారదాపూర్ణ శొంఠి రచించిన “పూర్ణమిదం” గ్రంథాన్ని గురువారం నాడు విజయవాడలో ఆవిష్కరించారు. ఏపీ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన సాహితీవేత్త అప్పాజోశ్యుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. శారదపూర్ణ-శ్రీరాం దంపతులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, విజయవాడ కల్చరల్ సెంటరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వోదయ గొల్లనపల్లి ప్రసాద్, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి జీ.వీ.పూర్ణచంద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, గోళ్ల నారాయణరావు, ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో “పూర్ణమిదం” గ్రంథావిష్కరణ
Related tags :