జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభమైంది. జేబీఎస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ జెండా ఊపి మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను సీఎం పరిశీలించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని మొత్తం 11 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 9 స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, సుల్తాన్ బజార్‌తో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఎంజీబీఎస్ వరకు ఈ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.
JBS-MGBS మెట్రో ప్రారంభం

Related tags :