Movies

వెంటనే మరోసారి

Kangana Okays New Movie With Same Director

బాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది కంగనా రనౌత్. తన నటనకు పలు జాతీయ అవార్డులతో పాటు.. పద్మశ్రీని కూడా దక్కించుకున్న కంగన.. ‘మణికర్ణిక’ తర్వాత బయోపిక్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ కోవలోనే.. కంగన నటిస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన నటి-రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. జయలలిత జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్న ‘తలైవి’ సినిమాకి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ రచయిత కాగా.. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జయలలిత సినీ రాజకీయ జీవితంలో ముఖ్య పాత్రలు పోషించిన ఎమ్.జి.ఆర్, కరుణానిధి పాత్రల్లో అరవింద్ స్వామి, ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఔట్ పుట్‌పై కంగన ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉందట. అందుకే.. ఈ చిత్ర దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌తో వెంటనే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పిందట.తమిళ సాహిత్యంలో ‘శిలప్పాదికార‌మ్‌’ అనే పద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. 5,730 లైన్లతో కూడిన ఈ ఎపిక్ పోయెమ్.. ఆద్యంతం కన్నగి, కోవలన్ అనే భార్యాభర్తల పాత్రల చుట్టూ సాగుతుంది. ఈ పద్యంలో కన్నగి పాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు తమిళులు. ఇప్పుడు ఇదే పాత్ర నేపథ్యంతో.. ఎ.ఎల్.విజయ్ సినిమా చేయబోతున్నాడట. కంగన రనౌత్ ‘కన్నగి’ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా.. ఒక సినిమా పూర్తి కాకుండానే కంగనతో మరో చిత్రం చేసే అవకాశం రావడంతో.. క్లౌడ్ నైన్లో విహరిస్తున్నాడట అమలా పాల్ మాజీ భర్త ఎ.ఎల్.విజయ్. మొత్తంమీద.. ఈ ఏడాది జూన్ 26న రాబోతున్న ‘తలైవి’ కంగన-ఎ.ఎల్.విజయ్‌కి ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.