టీమ్ఇండియాకు వికెట్లు తీసే పేసర్లు అవసరమని దిగ్గజ సారథి కపిల్‌దేవ్ అన్నారు. యువ పేసర్ నవదీప్ సైనికి జట్టులో చోటివ్వాలని సూచించారు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌కు 348 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించినా కోహ్లీసేన ఓటమి పాలైంది. బుమ్రా, షమి మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఠాకూర్ 9 ఓవర్లు విసిరి ఏకంగా 80 పరుగులు ఇచ్చాడు. ‘టీమ్ఇండియాకు వికెట్లు తీసే బౌలర్లు అవసరం. నవదీప్ సైనిని జట్టులోకి తీసుకోవడం చాలా ముఖ్యం. తొలి వన్డేలో ఓడినందుకు కాదు. అద్భుతమైన వేగం, వికెట్లు తీసే సామర్థ్యం ఉంది కాబట్టే చోటివ్వమని అంటున్నాను. ఓ సారి బుమ్రాను చూడండి. తనను జాగ్రత్తగా ఎదుర్కొనేలా న్యూజిలాండ్‌పై ఒత్తిడి చేస్తాడు. బ్యాట్స్‌మెన్ దాడికి సిద్ధమైనప్పుడు ఇలాంటి బౌలర్లు వికెట్లు తీస్తారు. ఆటగాళ్ల ఎంపిక ఇష్టంపై ఆధారపడి ఉండొద్దు. విజయం సాధించే జట్టు అవసరాలు, కూర్పు కోసం ఉండాలి’ అని కపిల్‌దేవ్ అన్నారు.
“సైని”కుడికి అవకాశం ఇవ్వండి

Related tags :