DailyDose

13న ఏపీ కేబినేట్ భేటి-రాజకీయం

Telugu Political News Roundup Today-AP Cabinet Meeting On 13th

* గుంటూరు లో స్వరూప నంద సరస్వతీ కి అమరావతి సెగ.
గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం కు వచ్చిన సరూప నంద సరస్వతీ.అమరావతి కి మద్దతు పలకాలని మహిళలు నినాదాలు.జై అమరావతి నివాదాలు,మహిళలు పై వైసిపి నేతలు దాడికి యత్నం.బలవంతంగా స్వామీజీ ని కారులో ఎక్కించుకోని తీసుకెళ్ళిన వైసిపి నేతలు.
* జగన్‌ అంధప్రదేశ్‌గా చేసేలా ఉన్నారు: బైరెడ్డి
సీఎం జగన్‌పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీని జగన్‌ అంధప్రదేశ్‌గా చేసేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఎవరికి కావాలని, ఎవరు అడిగారు? అని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక ఏ అభివృద్ధి పనిచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌ పనిగట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ చర్యల వల్ల ఏపీ పునాదులు బీటలు వారుతున్నాయని, రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకొని ఏపీని కాపాడాలని కోరారు. జగన్‌ చర్యలతో కియానే కాదు… అన్ని పరిశ్రమలు పోతాయని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెప్పారు.
*పవన్ కళ్యాణ్ పెయిల్యుర్ ఏపీలో కమ్మ రెడ్లడే ఆధిపత్యం : ఉండవల్లి
ఏపీ చరిత్రలో మొదటి నుంచి రెండు కులాల ఆది[పత్యమే కొనసాగుతున్నది బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నా ఓటు బ్యాంకుగా మాత్రం బలోపేతం కాలేకపోయారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గురువారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్థానాని ఎపీలోని ఇతర కులాలతో పోల్చుతూ సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ పైనా సంచలన వ్యాఖ్యలు చేసారు.
* బాబు కంటే ఎక్కువ ప్రజాగ్రహానికి గురవుతాడు: కన్నా
సీఎం జగన్ పాలనా తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్‌ ప్రజాగ్రహానికి గురవుతారని అన్నారు. ముఖ్యమంత్రులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి విషయంలో కేంద్రంపై నెపాన్ని వేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి, కుట్ర ప్రకారమే సీఎం జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అమరావతిని పీక్కుతింటే.. జగన్ దోచుకోవడానికి వైజాగ్ వెళ్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమాన్ని కుల పోరాటంగా చూపటం దారుణం అన్నారు. అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. రాజధాని తరలింపును విశాఖ ప్రజలు సైతం ఆహ్వానించటం లేదన్నారు.
* జీవీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్.. ఓ పనికిమాలిన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖబర్దార్ అంటూ హెచ్చరికలు చేశారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ బీజేపీ వ్యవహారాల్లో జీవీఎల్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంలో మతలబు ఏంటి? అని అన్నారు. జగన్‌ను జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ శాఖకు తెలియకుండా జగన్‌ను కలవడంపై సమాధానం చెప్పాలని జీవీఎల్‌ను వర్ల డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జీవీఎల్‌కు ధైర్యముంటే రాజధానిలో పర్యటించాలని సవాల్ విసిరారు. తినిదే బీజేపీ కూడు.. పాడేది వైసీపీ పాట అంటూ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కంట్రోల్ చేయాలని హితవుచెప్పారు.
* వివేకా కుటుంబ సభ్యులకు రక్షణేది?:వర్ల
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు రక్షణ ఎక్కడుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం వారికి అవసరమైన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన పిటిషన్‌ను సీఎం జగన్‌ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్‌.. గురువారం సదరు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. కేసు విచారణకు వచ్చే సమయంలో రిట్‌ను వెనక్కి తీసుకోవడమేంటన్నారు. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే అంతఃపుర రహస్యాలు బయటకొస్తాయనుకున్నారా? అని వర్ల ప్రశ్నించారు.
* రాహుల్ గాంధీని ట్యూబ్‌లైట్ అన్న ప్రధాని మోడీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ ‘ట్యూబ్‌లైట్’ అని కామెంట్ చేశారు. ట్యూబ్‌లైట్లు వెలగడానికి బాగా టైమ్ పడుతుందంటూ సెటైర్ వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడుతుండగా రాహుల్ అడ్డుతగలడంతో ఆయన ఈ మాట అన్నారు.మరో ఆరు నెలల్లో యువత మోడీని కర్రలతో బాదేసే రోజు రాబోతోందని నిన్న ఓ కాంగ్రెస్ నేత అన్నారని, దానికి తాను రెడీ అవుతున్నానని వ్యంగ్యంగా అన్నారు మోడీ. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి కోసం సూర్య నమస్కరాలు మరింత ఎక్కువగా చేస్తానని అన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ.. ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో మోడీ తాను దాదాపు 40 నిమిషాల నుంచి మాట్లాడుతుంటే అటువైపు కరెంట్ పాస్ అవ్వడానికి ఇంత సమయం పట్టిందన్నారు. ‘ట్యూబ్‌లైట్లు’ ఇలానే ఉంటాయని ఆయన అనడంతో సభలో అంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
* స్వరూపానందకు అమరావతి సెగ
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు అమరావతి నిరసన సెగ తగిలింది. గుంటూరు శివారు గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలకు స్వరూపానంద ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు వివరించారు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చేయాలని కోరారు.
* చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్తి చేసి…: బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్తి చేసి… బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు. బాబు దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారని, ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబేనని బొత్స దుయ్యబట్టారు. పెన్షన్‌ జాబితాలో 4 లక్షల మందిని అనర్హులుగా తేల్చామని, సుమారు 7లక్షల మంది కొత్తవారికి పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. నిజమైన లబ్దిదారులందరికీ పెన్షన్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. చంద్రబాబు అసహనంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
* వైసీపీ ఎంపీ స్టాండప్ కామెడీకి ఫిదా అయిపోయా: నారా లోకేష్
వైసీపీ ఎంపీలపై ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్‌ సెటైర్లు వేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ పేరు కూడా తెలియకుండా.. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ స్టాండప్‌ కామెడీకి తాను ఫిదా అయిపోయానంటూ ట్వీట్ చేశారు. ‘‘అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది.
*ఉపన్యాసాలు సరే.. ఉద్యోగాలేవి?
కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజం లోక్సభలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రి మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్లు యువతకు ఉపాధి కల్పించేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో ఎందుకు చెప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నెహ్రూ, పాకిస్థాన్ల గురించి ప్రధాని మాట్లాడుతూ ప్రధాన సమస్యలపై ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్ సోకితే కేంద్ర ప్రభుత్వం జలుబుకు ఇచ్చే మందు వేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆక్షేపించారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం విక్రయానికి పెట్టిందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై గురువారం లోక్సభలో ప్రారంభమైన చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ‘బేచో ఇండియా’ అన్నట్లుగా ప్రభుత్వ విధానం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరించరాదని శివసేన సభ్యుడు అర్వింద్ సావంత్ అన్నారు.
*నారా లోకేశ్కు భద్రత కుదించిన ప్రభుత్వం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కుదించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న వై ప్లస్ కేటగిరి (2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రేపటి నుంచి 1+1 భద్రత మాత్రమే ఉంటుందని పేర్కొంది. 2014కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా లోకేశ్కు 2+2 భద్రత కల్పించగా.. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 4+4కు పెంచారు. ఏవోబీలో మావోయిస్టులు ఎమ్మెల్యేను హతమార్చిన తర్వాత ఓ లేఖ బయటపడటంతో లోకేశ్ భద్రతను Z కేటగిరీకి మార్చారు. 4+4 భద్రతతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించారు. పైలట్, రోప్ పార్టీ, స్థానిక పోలీసుల భద్రతను కల్పించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4+4 నుంచి 2+2కు.. తాజాగా 1+1కు భద్రతను కుదించారు.
*రాజధాని అంశంపై స్పందించిన ఉండవల్లి
ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ర్టంలో పెట్టుబడులు ఎవరు పెడతారని.. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ మూడు రాజధానుల అంశం లేదని.. ఇక్కడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. రాజధాని రైతుల దృష్టిలో తమను నష్టపరిచిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచారని ఉండవల్లి ఆక్షేపించారు.
*గృహ నిర్మాణాలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలి: నామా
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలే ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని మరింత పెంచాలని తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. లోక్సభ శూన్యగంటలో గురువారం ఆయన మాట్లాడారు. హాల్, వంట గది, మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి చెబుతున్నారని, కానీ కేంద్రం ఇచ్చే నిధులతో ఒక గదిని మాత్రమే నిర్మించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.6.50 లక్షలు కేటాయిస్తోందని తెలిపారు. ప్రభుత్వమే ఇంటి నిర్మాణానికి భూమి ఇవ్వడంతో పాటు రెండు పడక గదులు, మరుగుదొడ్డి, వంటగది నిర్మించి ఇస్తోందని చెప్పారు.
*కర్ణాటక మంత్రివర్గం విస్తరణ.. పది మందికి చోటు
కర్ణాటక ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. గురువారం ఉదయం రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఉప ఎన్నికల్లో గెలిచిన 11మందిలో ఒక్కరికి మంత్రివర్గంలో చోటుదక్కలేదు. కొత్తగా చేరిన సభ్యులతో కర్ణాటక మంత్రివర్గ సభ్యుల సంఖ్య 28కి చేరగా, మరో ఆరు ఖాళీలున్నాయి. రమేశ్ జార్ఖిహొళి, ఎస్.టి.సోమశేఖర్, కె.గోపాలయ్య, నారాయణగౌడ, భైరతి బసవరాజు, కె.సుధాకర్, శ్రీమంత పాటిల్, శివరామ్ హెబ్బార్, ఆనంద్సింగ్, బి.సి.పాటిల్చే గవర్నర్ వాజూబాయ్ వాలా మంత్రులుగా ప్రమాణం చేయించారు.
*భాజపాతో పొత్తుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా
తెలంగాణలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం కొన్ని చోట్ల భాజపాతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా యాచారం మండల పరిషత్, మణికొండ మున్సిపాలిటీల్లో భాజపాతో కాంగ్రెస్ నేతలు పొత్తు కుదుర్చుకున్నారని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీల దృష్టికి తీసుకెళ్లిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీపీసీసీ నుంచి కేసీ వేణుగోపాల్ కార్యాలయం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
*ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు, ఉద్యోగ సంఘాల నేతల ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ఏర్పాటుపై గురువారం రాజ్యసభలో బాధ్యతారహితంగా మాట్లాడారని రాష్ట్రమంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. అమరుల త్యాగఫలం, కేసీఆర్ పోరాట పటిమతో సాగిన ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను ప్రపంచమంతా గుర్తించిందని, మోదీకి వీటిపై అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. ప్రధాని ఉద్యమకారులను అవమానించారని బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్, ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్రెడ్డి, మమత పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన సమగ్రంగా జరగలేదని, అర్ధరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టారని, తలుపులు మూసి తీర్మానం చేసిందని ప్రధాని అనడం దురదృష్టకరం.
*పరిశ్రమలు తరలిపోతే ఉపాధి ఎలా?-జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
పెట్టుబడిదారులను భయపెడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రశ్నించారు. నాయకుల ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, రాక రాక వచ్చిన కియా కార్ల కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. శంషాబాద్లో గురువారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమీక్షలో పవన్ మాట్లాడారు. అంతకు ముందు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వాటి సారాంశమిదీ ‘రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్వేర్ సంస్థలు తరలిపోతున్నాయి. ఇలా అయితే ఉపాధి కల్పన ఎలా సాధ్యం? రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్వేర్ సంస్థలను ఖాళీ చేయించడమంటే ఆ రంగం ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే. ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్లతో కాగితం పరిశ్రమ స్థాపిస్తామన్న ఏషియన్ పేపర్స్ అండ్ పల్స్ పరిశ్రమ మహారాష్ట్రకు తరలిపోయింది.
*పరిశ్రమలు లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలు: సీపీఐ
పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న సంస్థలు తరలిపోయే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తీవ్ర కరవు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురంలో దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ‘కియా’ కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పిందని, కియా ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చించినట్లు ప్రఖ్యాత వార్త సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. కియా సంస్థ ఏపీలో తన ప్లాంటును విస్తరించాలేగాని, ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు.
*తెదేపా చీలిపోతుందని చంద్రబాబుకు ఆందోళన-ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి
‘తెదేపాలో చీలిక రాబోతుంది. ఆ ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. శాసనమండలి రద్దుతో ఉన్న ఎమ్మెల్సీ పదవిని పోగొట్టారంటూ లోకేశ్ రూపంలో చంద్రబాబుకు ఇంటిపోరు కూడా మొదలైంది. అందువల్లే చంద్రబాబులో అసహనం పెరిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు’ అని ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
*విశాఖ భూకబ్జాలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ
విశాఖలో భూకబ్జాలతో పాటు నాగార్జున వర్సిటీ వీసీ వ్యవహార శైలిపై వాస్తవాలు తెలుసుకునేందుకు తెదేపా రెండు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేసింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వీటిని ఏర్పాటుచేశారు. విశాఖ భూకబ్జాలపై ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధను నియమించారు. నాగార్జున వర్సిటీ విద్యార్థులపై వీసీ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణలను నియమించారు
*కర్ణాటక మంత్రివర్గం విస్తరణ
కర్ణాటక ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. గురువారం ఉదయం 10.30 గంటలకు రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఉప ఎన్నికల్లో గెలిచిన 11మందిలో ఒక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కొత్తగా చేరిన సభ్యులతో కర్ణాటక మంత్రివర్గం మొత్తం సభ్యుల సంఖ్య 28కి చేరగా, మరో ఆరు ఖాళీలున్నాయి. రమేశ్ జార్ఖిహొళి, ఎస్.టి.సోమశేఖర్, కె.గోపాలయ్య, నారాయణగౌడ, భైరతి బసవరాజు, కె.సుధాకర్, శ్రీమంత పాటిల్, శివరామ్ హెబ్బార్, ఆనంద్ సింగ్, బి.సి.పాటిల్చే గవర్నర్ వాజూబాయ్ వాలా మంత్రులుగా ప్రమాణం చేయించారు.