ScienceAndTech

స్క్రిప్టు మీరు రాస్తే…సినిమా యాప్‌లో వచ్చేస్తుంది

Write scripts and let this app make a movie out of it for you

రో వీడియో తీయాలనుకుంటున్నారు. అది ఎలా తీయాలనే ఆలోచన మీ మనసులో ఉంది. దానికోసం స్క్రిప్టు కూడా రాసుకున్నారు. ఇక తీయడమే మిగిలి ఉంది. కానీ ఇకముందు ఆ అవసరం ఉండదు. రాసినదాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌ ఆప్‌లోకి పంపిస్తే చాలు… అదే దానికి సంబంధించిన వీడియోని తీసి ఇచ్చేస్తుంది. రైట్‌-ఎ-వీడియో పేరుతో ఈ టూల్‌ని ఈమధ్యే హార్వర్డ్‌, చైనాలోని సింగువా బీహాంగ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిసి హెర్జిలియా యూనివర్సిటీ బృందంతో కలిసి రూపొందించారు. స్క్రిప్టులో రాసిన విషయాన్ని అర్థం చేసుకుని దానికి అందుబాటులో ఉన్న ఫొటోలూ బొమ్మలతో కథకి అనుగుణంగా ఎంతో సులభంగా వీడియో తీసేస్తుందట. పైగా దీనివల్ల వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ వంటి వాటి అవసరం కూడా ఉండదట. ఒకవేళ వీడియో పూర్తయ్యాక స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేస్తే మళ్లీ దానికి తగ్గట్లే అది షాట్‌ తీయడం, ఉన్నదాన్ని డిలీట్‌ చేయడం… వంటివి చేసి ఫైనల్‌ కాపీని అందిస్తుంది. ఈ టూల్‌ ద్వారా తీసిన వీడియోలు ఎంతో సహజంగానూ ఉన్నాయట. దాంతో ఈ టూల్‌ యానిమేటెడ్‌, గ్రాఫిక్స్‌, గేమింగ్‌ వంటి రంగాల్లో వీడియోలూ సినిమాలూ తీయడానికీ ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు. సో, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజిన్స్‌ అనేది మానవ సృజనకే పోటీ వచ్చినా ఆశ్చర్యం లేదు.