WorldWonders

మద్రాసు మహిళా పూజారి గురించి విన్నారా?

Madras Female Priest Maheswari Makes The News

మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతోన్న నేపథ్యంలో.. వేద మంత్రాల ఉచ్ఛారణతో అద్భుతంగా పెళ్లి జరిపించిన మహిళా పూజారి చూపరులందరినీ ఆకట్టుకుంది. హిందూ సాంప్రదాయంలో సాధారణంగా మగ పురోహితులే పెళ్లి తంతును నిర్వహిస్తారు. కానీ చెన్నైలో ఓ మహిళా పూజారి.. ఓ జంటకు పెళ్లి చేసింది. వేద మంత్రాలు చదువుతూ.. ఆమె ఆ పవిత్ర కార్యాన్ని నిర్వహించింది. బ్రమరాంబ మహేశ్వరి అనే మహిళ పెళ్లి పంతులు పాత్రను అద్భుతంగా పోషించింది. తెలుగు అమ్మాయి సుష్మా హరిని, తమిళ అబ్బాయి విఘ్నేశ్‌ రాఘవన్‌ల పెళ్లికి మహేశ్వరి పూజారిగా మారడం అక్కడకి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. చెన్నై శివారు ప్రాంతమైన దక్షిణ చిత్రలో ఈ వేడుకను నిర్వహించారు. మైసూర్‌కు చెందిన బ్రమరాంబ వేద విద్యలో నిష్ణాతురాలు. గతంలో ఆమె ఎన్నో పెళ్లిల్లు కూడా చేశారు. వాస్తవానికి ఈ పెళ్లి కోసం మహిళా నాదస్వర, మఅదంగ బఅందాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ వారికి ఆ బఅందాలు దొరకలేదు. కానీ మహిళా పూజారి బ్రమరాంబ నిర్వహించిన పెళ్లి తంతు .. ఆ పెళ్లికి హాజరైన వారిని ఆకట్టుకుంది. పూజారి తన మంత్రాలను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి ఆ దంపతులకు వివరించారు. పెళ్లికి వచ్చిన అతిథులు.. పూజారి బ్రమరాంబ వివరాలు సేకరించారు. మహిళా పూజారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బ్రమరాంబను ఆహ్వానించినట్లు పెళ్లి నిర్వాహకులు తెలిపారు.