ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరులో 150 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. వీరికి 30 రోజులు తల్లం రత్నకుమారి టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ప్రారంభించారు. రోబోజ్ఞాన్ సీ.ఈ.ఓ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. హిందూ ఇంజనీరింగ్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మల్లిఖార్జునరావు, సమాజ చైతన్య సంఘం అధ్యక్షులు గుంటూరు పరిశుద్ధరావు, సమాజ సేన సీతారాం తదితరులు పాల్గొన్నారు.
150 మహిళలకు నాట్స్ కుట్టుమిషన్ల పంపిణీ
Related tags :