Movies

అభిమానులకు ఆనందాల రాశి

Rashi Khanna On World Famous Lover And Her Fans

‘ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లూ తెచ్చింది’.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని ఈ పాటను వింటే వెంటనే గుర్తుకువచ్చేది నటి రాశీఖన్నా. బబ్లీ, బబ్లీగా కనిపించి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఈ నటి. ఆ తర్వాత ఆమె ఎన్నో ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది తాజాగా కొత్త ఏడాదిలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నా విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో పోషించిన యామిని పాత్ర విభిన్నంగా ఉంటుంది. యామిని పాత్ర ఎమోషనల్‌గా ఒక ఛాలెంజ్‌తో కూడుకున్నది. నేను ఇప్పటివరకూ చేసిన పాత్రల కంటే ఈ పాత్రను చాలా ఫీల్‌ అయ్యి చేశాను. ఒకవేళ నేను రిలేషన్‌లో ఉంటే ఎలా ఉంటాను. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాను అనే విషయాలను అనునయించుకుని ఈ పాత్రను పోషించాను. ఈ టీజర్‌ చూసి అభిమానులు నా పాత్ర గురించి బాధపడ్డారు. కానీ సినిమా చూశాక తప్పకుండా వాళ్లు హ్యాపీ ఫీలవుతారు.