DailyDose

చైనా నుండి ఇంటికి చేరిన కేరళ విద్యార్థులు-తాజావార్తలు

Telugu Top Breaking News Of The Day-Kerala Students From China Reach Home

* దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మళ్లీ సామాన్యుడి (ఆమ్‌ ఆద్మీ) పార్టీయే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. దిల్లీలో మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌, భాజపా హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఒక్క అవకాశం ఇచ్చినందుకు జగన్‌ వల్ల రాష్ట్రానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, అనర్థాలు వచ్చిపడ్డాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 7 లక్షల పింఛన్లను ఎత్తివేశారని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున పింఛన్‌, రేషన్‌ కార్డులు ఎత్తేసి జగన్‌ సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. వనదేవతల వనప్రవేశం వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మూసీ నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా సుధీర్ రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* థాయిలాండ్‌లో ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఖోరత్‌ ప్రాంతంలో తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారందరిపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* శ్రీలంకలో ఉన్న తమిళ మైనారిటీల పట్ల ఆ దేశ ప్రభుత్వం సమానత్వం, న్యాయం, గౌరవం చూపిస్తుందన్న విశ్వాసం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత పర్యటనకు విచ్చేసిన శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సతో మోదీ శనివారం సమావేశమయ్యారు. ‘భారత్‌, శ్రీలంక రెండూ కేవలం పక్క దేశాలే కాదు.. మంచి స్నేహితులు కూడా. శ్రీలంక అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉంది. మన ప్రాంతానికి ఉగ్రవాదం అతిపెద్ద సమస్య. మన రెండు దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలి’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చట్టసభల్లో రాజకీయపార్టీల నాయకుల తీరుపై ఉపరాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. నిన్న పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటుగా ఉంటోందన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే గానీ శత్రువులు కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమ్‌ఇండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ ఆడనున్న విషయం తెలిసిందే. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన యువ భారత్‌.. ఆదివారం తుదిపోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌ను అందుకోనుంది. మరోవైపు సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల మధ్య నాలుగు రోజుల విశ్రాంతి దొరకడంతో ఆటగాళ్లను విహార యాత్రకు తీసుకెళ్లింది టీమ్‌ఇండియా యాజమాన్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చైనా నుంచి వచ్చిన భారత్‌కు చేరుకున్న కేరళ విద్యార్థులను నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. వారిలో కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళకు చెందిన 15 మంది విద్యార్థులు హుబేయి ప్రావిన్స్‌లో చిక్కుకుపోయారు. వాళ్లందరూ శుక్రవారం రాత్రి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కర్తార్‌పూర్‌ నడవాను పాస్‌పోర్టు లేని భారతీయులు సందర్శించుకునేందుకు వీలుగా ప్రతిపాదనను పాకిస్థాన్‌ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్‌ షా తెలిపారు. ‘ప్రస్తుతం కర్తార్‌పూర్‌ నడవాను సందర్శించాలంటే భారతీయులు తప్పనిసరిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఇక నుంచి పాస్‌పోర్టు లేకపోయినా కర్తార్‌పూర్‌ను సందర్శించేందుకు అనుమతించాలి’ అని ఇజాజ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి