ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఆదివారం గిల్‌క్రిస్ట్ XI, పాంటింగ్ XI జట్ల మధ్య ఛారిటీ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ.. పాంటింగ్ జట్టులో ఆడుతున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గిల్‌క్రిస్ట్ జట్టులో ఉన్నాడు. వీరిద్దరూ గతంలో పోటాపోటీగా తలపడేవారు. అయితే, ఆదివారం జరిగే మ్యాచ్‌లో మరోసారి పోటీపడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బ్రెట్‌లీ రేపు 150 కిమీల వేగంతో బంతులేస్తే ఏమౌతుందని యువీని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఒకవేళ నిజంగా బ్రెట్‌లీ అంతటి వేగంతో బంతులేస్తే తాను నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉంటానని జోక్ చేశాడు.
నాన్‌స్ట్రైకింగ్‌లో దాక్కుంటాను
Related tags :