* భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ ఇటీవల ‘శిఖర: అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్’ సినిమా చూస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘శిఖర: అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్’ అనే హిందీ సినిమాను ప్రముఖ దర్శకుడు విదు వినోద్ చోప్రా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. అయితే ఇటీవల ‘విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్’ సంస్థ అధికారిక ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
* ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గపు చర్యని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు పాలనా ధర్మం కాదని.. ఒక వ్యక్తి తన వ్యక్తిగత కక్ష సాధింపునకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలపై కక్ష సాధించే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామని.. ఉద్యోగులను బలికోరే పాలకుడికి మనుగడే ఉండదన్నారు.
* నగరంలోని పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మహంకాళి ఆలయానికి చాలినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని..
* దిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఒకటికి రెండు సార్లు పరిశీలించడం వల్లే ఓటింగ్ శాతాన్ని ప్రకటించడానికి ఆలస్యమైందని ఈసీ పేర్కొంది. దిల్లీ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం ఓటింగ్ నమోదైందని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రెండు శాతం పెరిగిందన్నారు. బలిమరన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6శాతం నమోదైనట్లు తెలిపారు.
* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాసినట్లు మీడియా వర్గాల సమాచారం. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్న చైనా ప్రజలకు మోదీ సంఘీభావం తెలిపారు. ఈ విషమహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ఆయన లేఖ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.
* జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల పన్ను ఆదాయం 14 శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని భరిస్తూ కేంద్రం ఐదేళ్ల పాటు ఆ నష్టం చెల్లిస్తుంది.
* సర్జికల్ మాస్క్‌లు, గ్లోవ్స్‌పై ఉన్న ఎగుమతి నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల ఎగుమతులపై గత నెలలో ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకసారి వినియోగించే పారేసే మాస్క్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దాదాపు 25 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,500 పైగా వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. అత్యధికంగా చైనాలో దీని దాటికి 811 మంది మరణించగా.. 37,198 మంది ఇంకా దీని కోరల్లో ఉన్నారు. హాంగ్‌కాంగ్‌లో 25 కేసులు నమోదు కాగా.. ఒకరు మరణించారు. దేశాల వారీగా దీని బారిన పడిన వారి వివరాలు చూసుకుంటే..
* దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ తుది పోరులో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేస్తున్న సమయంలో దివ్యాన్ష్ సక్సేనా మీదకు బంగ్లా ఫాస్ట్ బౌలర్ తన్జీమ్ హసన్ బంతిని విసిరాడు. మొదట్లో వికెట్ పడకపోవడంతో బంగ్లా బౌలర్లు అసహనానికి గురయ్యారు.
* ప్రాణాంతక వైరస్ కరోనాతో చైనా వణుకుతోంది. ఒక్క చైనానే కాదు. ప్రపంచ దేశాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంతో జనవరి 15 తర్వాత చైనా వెళ్లి అక్కడి నుంచి వచ్చే విదేశీయులను భారత్‌లోకి అనుమతించబోమని డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రకటించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
* నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంత్ రవిదాస్ 621వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏతో దేశ పౌరులకు జరుగుతున్న అన్యాయమేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని, చొరబాటుదారులకు కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
* రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, మజ్లిస్ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలతో కూడిన కమిటీ ప్రగతి భవన్లో ఆదివారం భేటీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌తో పాటు మరో కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారు.
* భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత బ్యాటు పట్టి బరిలోకి దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ దాటించి అభిమానులను అలరించాడు. బుష్ఫైర్ బాధితుల సహాయార్థం రికీ పాంటింగ్ ఎలెవన్ × గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్ల మధ్య ‘బిగ్ బాష్ ఫైర్’ మ్యాచ్ జరిగింది. అయితే, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ సచిన్‌కు సరదాగా ఛాలెంజ్ విసిరింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సవాల్ చేసింది. దీనికి సచిన్ ‘ఓకే’ అన్నాడు.
* కేరళ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన అలెప్పీ ప్రజలను ఆదుకోవాలని రామోజీ గ్రూపు బలంగా నిశ్చయించుకుందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళ ప్రభుత్వం కంటే ఎక్కువ ఆసక్తి, తపన కనబరిచిందని ఆయన కొనియాడారు. ఆదివారం కేరళ వరద బాధితులకు ‘ఈనాడు’ సహాయనిధితో చేపట్టిన నూతన గృహాలను సీఎం అందజేశారు. 121 లబ్ధిదారులకు తాళాలను ఆయన అందించారు.
* శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. ఫిబ్రవరి 11న వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి ఆప్‌తో కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడుతుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
* నూతన కంపెనీలను, సంస్థలను భారత్‌లో ఏర్పాటు చేయాలనుకునే వారికి వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి కంపెనీలు నమోదు చేసుకునేందుకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఫాంను అందుబాటులో తీసుకురానుంది. దీంతో పాటు ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెంటనే జారీ చేయనున్నారు.
* తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని యాంకరేజి పోర్టు వద్ద ఐరన్ బార్జ్ ఓడ నీట మునిగింది. పెద్ద ఓడల్లోని సరకు రవాణా చేసేది ఈ ఐరన్ బార్జ్. నూకల లోడుతో ఉన్న ఓడను డీప్ వాటర్ పోర్టుకు తీసుకెళ్తుండగా నీట మునిగింది. ఈ ఘటనతో సముద్రంలో కలిసిపోయిన నూకల విలువ రూ.1.5కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
* ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రేనాల్ట్ డస్టర్‌లో బీఎస్6 1.3 టర్బో పెట్రోల్ ఇంజిన్ డస్టర్‌ను ఆటో ఎక్స్పో2020లో ప్రదర్శించింది. డస్టర్ సరికొత్త వెర్షన్లో పలు మార్పులు చేసింది. కొత్త ఇంజిన్‌లో మొత్తం నాలుగు సిలిండర్లు ఉంటాయి. ఇది 153 బీహెచ్పీ శక్తిని విడుదల చేయడంతోపాటు 250 ఎన్ఎం టార్క్‌ను కూడా విడుదల చేస్తుంది.
* కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న తొలి 20 దేశాల్లో భారత్ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు జర్మనీకి చెందిన హంబోల్ట్ యూనివర్సిటీ, రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ ఓ ప్రత్యేక ‘కంప్యూటేషనల్ లేదా మ్యాథమేటికల్’ మోడల్‌ను అభివృద్ధి చేశాయి. మొత్తం 30 దేశాలపై వారి అధ్యయనం కొనసాగింది. దీంట్లో భారత్ 17వ స్థానంలో నిలిచింది.