WorldWonders

2020లో 13 పౌర్ణమిలు

Telugu Devotional News Today-2020 Has 13 Full Moon Days

2020లో మొత్తం 13 పూర్ణిమ రోజులు రానున్నాయి.

వీటిలో ఫిబ్రవరి 9న వచ్చిన పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఖగోళశాస్త్రజ్ఞులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు రాత్రి ఈ ఏడాదిలోని తొలి సూపర్ మూన్ ఏర్పడనుంది.

చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం మేరకు అధిక ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు ఈ మూన్‌కు ‘స్నో మూన్’ అని పేరు పెట్టారు.

కాగా ఇటువంటి సూపర్ మూన్ 1979లో కనిపించించింది.

దానికి శాస్త్రవేత్తలు ‘పెరిజీన్ ఫుల్ మూన్’ అనే పేరు పెట్టారు.

కాగా ఈరోజు రాత్రి సుమారు ఒంటి గంట మూడు నిముషాలకు సూపర్ మూన్ కనిపించనుంది.

కాగా మరికొందరు ఖగోళశాస్త్రవేత్తలు ఈరోజు కనిపించేది సూపర్ మూన్ కాదని, అయితే చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తాడని చెబుతున్నారు.