చికాగో ఆంధ్రా సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా(APDFNA) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన పేద మహిళలకు చేయుతనందించే కార్యక్రమానికి ఆదివారం నాడు శ్రీకారం చుట్టారు. నారసంచుల తయారీ కేంద్రాన్ని APDFNA డైరకటర్ దిట్టకవి వాణీ సమన్వయంలో ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిసు సంక్షేమ శాఖ కార్యదర్శి మాధవీ లత, ఏపీ ప్రత్యేక కార్యదర్శి ఆర్జా శ్రీకాంత్, పద్మలత తదితరులు పాల్గొన్నారు. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కేంద్రం తోడ్పాటును అందిస్తుందని వక్తలు ఆశించారు.
హనుమాన్ జంక్షన్ మహిళలకు చికాగో ఆంధ్రా సంఘం చేయూత
Related tags :