ప్రముఖ సింగర్ మనోపై గాయని చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేశారు. గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా కార్తీక్, మనో మంచి సింగర్సే కానీ, మంచి పురుషులు కాదంటూ ఆమె ఆరోపించారు. సింగర్ కార్తీక్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని కొంతకాలం క్రితం సోషల్‌మీడియా వేదికగా చిన్మయి చేసిన ఆరోపణలు కోలీవుడ్‌లో దుమారం రేపాయి. ఆ తర్వాత కోలీవుడ్‌లో చాలా పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కోలీవుడ్‌లో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్మయి నామినేషన్ దాఖలు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. దీంతో సీనియర్ నటుడు రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా వేధింపు ఆరోపణలు ఎదుర్కొన్న కార్తీక్‌కు సైతం యూనియన్‌లో చోటు దక్కింది. డబ్బింగ్ యూనియన్ ఎన్నికల గురించి తెలియచేస్తూ సింగర్ మనో ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన చిన్మయి ఆయన గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. ‘‘చాలా రోజుల క్రితం సింగర్ మనోగారు నాకు ఫోన్ చేసి.. కార్తీక్ గురించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లందరినీ తీసుకుని తన ఇంటికి రమ్మని చెప్పారు. ‘ఈ వేధింపుల విషయం విని కార్తీక్ భార్య బాధపడుతోంది. తన కెరీర్‌ను ఎందుకు నాశనం చేస్తున్నావు? నువ్వు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డావు. అలాగే తనూ కూడా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు’ అని చెప్పి, రాజీ కుదర్చడానికి చూశారు. నిజం చెప్పాలంటే వృత్తిపరంగా కార్తీక్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఎంతో కష్టపడి పెద్ద సింగర్ స్థాయికి వచ్చారు. నేను కూడా ఆయనలాగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అందరూ గుర్తించే స్థాయికి వచ్చాను. కానీ, ఈ స్థాయికి వచ్చాక ఆయనలాగా వేరేవాళ్లను వేధింపులకు గురిచేయలేదు. ఏది ఏమైనా గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. వాళ్లు మంచి సింగర్సే అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ మంచి పురుషులు మాత్రం కాదు.’ అని చిన్మయి పేర్కొన్నారు.
MeToo మీడియేటర్‌గా మనో

Related tags :