యూఏఈలోని ప్రధాన బ్యాంకులు భారతీయ ఎగవేతదారులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇండియన్స్ ఎగవేసిన వాటిలో చాలా వరకు లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొన్నాయి. దీంతో తాము రూ.50వేల కోట్లకుపైగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నాయి. ఇలా లోన్స్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడిన భారతీయుల్లో అత్యధికులు కేరళ వాసులు ఉన్నట్లు బ్యాంకులు తెలిపాయి. తాజాగా ఆర్థిక లావాదేవీలపై యూఏఈలోని సివిల్ కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులు భారతదేశంలోని జిల్లా కోర్టుల ఉత్తర్వులకు సమానమని భారత ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే యూఏఈ బ్యాంకులు భారతీయ ఎగవేతదారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ ఎగవేతలలో 70 శాతం వ్యాపార సంస్థలు రుణాలుగా తీసుకున్నవి, మిగతా 20 శాతం క్రెడిట్ కార్డ్ బిల్స్, వాహనాల లోన్లు, వ్యక్తిగత రుణాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే యూఏఈలోని పెద్ద బ్యాంకులైన ఎమిరేట్స్ ఎన్బీడీఅబుదాబి కమర్షియల్ బ్యాంక్ ఎగవేతదారులపై చర్యలకు ఉపక్రమించాయని తెలుస్తోంది. ఈ బ్యాంకులతో పాటు ఖతార్ఒమన్ దేశాల్లో ప్రధాన శాఖలు కలిగిన బ్యాంక్స్ కూడా చేతులు కలిపాయని సమాచారం. ఈ ప్రధాన బ్యాంకులన్నీ కలిసి తమ దగ్గర రుణాలు తీసుకొని ఎగవేతలకు పాల్పడిన ఇండియన్ బిజినెస్ గ్రూపుల వివరాలను బయటపెట్టాలని నిర్ణయించాయట. అయితేఇప్పటి వరకు భారతీయ ఎగతవేతదారులపై యూఏఈ బ్యాంకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత వ్యాపార సంస్థల యజమానులు భారీ మొత్తంలో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా ఎగవేతలకు పాల్పడి ఆ దేశం విడిచిపెట్టి వచ్చేయడంతో రుణాలు తీసుకున్న బ్యాంకులను ఆర్థిక సంక్షోభంలో పడేయడంతో పాటు ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మందిని ఉపాధి లేకుండా చేస్తున్నారు.
అరబ్బీ బ్యాంకులకు భారతీయుల పంగనామం
Related tags :