* దేశంలోనే అత్యాధునిక విద్యుత్తు స్కూటర్‌ను ఐఐటీ హైదరాబాద్‌లో తయారు చేశారు. ఐఐటీతో కలిసి పనిచేస్తున్న ప్యూర్ ఈవీ అనే అంకుర సంస్థ …ఈ స్కూటర్‌ను రూపొందించింది. ‘ప్లూటో 7జీ’ పేరుతో తయారు చేసిన ఈ స్కూటర్‌ను నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునేలా ఈ వాహనాన్ని రూపొందించారు. దీనిలో బ్యాటరీ వారంటీ నలభై వేల కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ వాహనం అత్యధిక వేగం గంటకు 60 కిలోమీటర్లు. కాగా దీని ధరను రూ.80,000గా నిర్ణయించారు.
* టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.499 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే జీ5 యాప్‌కు వినియోగదారులకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇక సర్కిల్‌ను బట్టి ఈ ప్లాన్ వాలిడిటీని 60 నుంచి 70 రోజుల వరకు నిర్ణయించారు. అలాగే రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్‌కు వొడాఫోన్ పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌కు 70 రోజుల వాలిడిటీని నిర్ణయించగా, ఇకపై 77 రోజుల వాలిడిటీ కస్టమర్లకు లభ్యం కానుంది. అలాగే రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
* హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్ బీదర్-బెంగళూరుల మధ్య విమాన సేవలను ప్రారంభించింది. ఉడాన్ పథకం కింద సేవలు అందిస్తున్న పట్టణాల నెట్‌వర్క్‌లో తాజాగా బీదర్ చేరిందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కేఈ ప్రదీప్ తెలిపారు.
* బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను (ఐటీ) విధానానికి పన్ను చెల్లింపుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదార్లలో 80 శాతం మంది, పన్ను మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త విధానానికి మారే అవకాశం ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే చెప్పారు.
* హైదరాబాద్‌తో పా టు తెలుగు రాష్ట్రాల్లో ఐదు తయారీ యూనిట్లు కలిగిన టెక్నో పెయింట్స్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో మ రో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
* టెక్నో యూనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) నోటీసులు జారీ చేసింది. కంపెనీ తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో దానికి హామీదారులుగా ఉన్న మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, ఆయన ఇద్దరు కుమారులు, మరికొందరికి.. కరూర్ వైశ్యా బ్యాంక్ (ఆబిడ్స్, హైదరాబాద్ శాఖ) పత్రికా ప్రకటన ద్వారా ఈ నోటీసులు జారీ చేసింది.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)లు విలీనమవుతున్న విషయం తెలిసిందే. వీటి విలీనం ద్వారా ఏర్పాటయ్యే కొత్త బ్యాంకు పేరు దాని లోగోను త్వరలోనే కేంద్రం ఆవిష్కరించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించనుంది. దీని వ్యాపార పరిమాణం రూ.18 లక్షల కోట్లు ఉండనుంది. కొత్త బ్యాంకు 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్యకలాపాలు సాగించనుంది.
* వివాదాస్పద ఫైనాన్సియల్ రిసొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ ఈ విషయం వెల్లడించారు. అయితే ఎప్పుడు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారనే విషయం మాత్రం చెప్పలేనన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే బ్యాంక్ డిపాజిటర్ల డిపాజిట్ల చెల్లింపులకు రక్షణ ఉండదని గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాంతో ప్రభుత్వం అప్పట్లో ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. మొన్న టి బడ్జెట్లో బ్యాంకు డిపాజిట్ల బీమా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి మళ్లీ ఈ బిల్లు ప్రస్తావన తీసుకురావడం విశేషం.
* దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీఐ) వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. దీంతో బ్యాంక్ రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. అయితే, ఎస్బీఐలో నిర్దిష్ఠ కాలపరిమితికి డిపాజిట్ చేసే సొమ్ముపైన లభించే వడ్డీ రాబడికి మాత్రం కోతపడనుంది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను మరో 0.05 శాతం తగ్గిస్తున్నట్లు శుక్రవారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నెల 10 (సోమవారం) నుంచి ఇది అమల్లోకి రానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ను తగ్గించడం వరుసగా ఇది 9వ నెల. దీంతో ఏడాది కాలపరిమితి రుణాలకు వర్తించే ఎంసీఎల్ఆర్ 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గనుంది.
* ఆదాయం పెరిగినప్పటికీ.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి అరబిందో ఫార్మా నికర లాభం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం ఒక శాతం తగ్గి రూ.712.2 కోట్ల నుంచి రూ.705.3 కోట్లకు చేరిందని అరబిందో వెల్లడించింది.
ప్లూటో 7జీ స్కూటర్-వాణిజ్యం
Related tags :