*బీహార్ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం పాట్నాలోని గాంధీ మైదానం సమీపంలోని దల్దలీ రాడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు జరిగింది. దీంతో ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా ధ్వంసమైంది. ఇంట్లో అక్రమంగా దాచిన బాంబు కారణంగానే ఈ పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
* బాదంపూడి వంతెన సమీపంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
* గజపతినగరంలోని తెలుగుదేశం నాయకులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ… సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10 వేలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించినవారికి ఒక రోజు సెలవియ్యాలని, మరణించిన కార్మికుని దహన సంస్కారానికి రూ.20 వేలు ఇవ్వాలని, గ్రీన్ అంబాసిడర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
* సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.జయచంద్రారెడ్డి మృతి పట్ల సిఎం జగన్ సంతాపం తెలిపారు. జస్టిస్ జయచంద్రారెడ్డి మహోజ్వల వ్యక్తిత్వం కలిగినవారని, లా కమిషన్ చైర్మన్ గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆయన అందించిన సేవలు విలువైనవని జగన్ కీర్తించారు. భారత న్యాయ వ్యవస్థకు ఆయన భాగస్వామ్యం ఎన్నదగినదని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో జయచంద్రారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు సిఎం జగన్ ట్వీట్ చేశారు.
* షాద్ నగర్ కేశంపేట్ మండలం కాకునుర్ గ్రామానికి చెందిన ముగ్గురు అనాధ చిన్నారులను, షాద్ నగర్ ఐసిడిఎస్ అధికారులు హైదరాబాద్ శిశు విహారుకు తరలించారు.
* పశ్చిమ గోదావరి జిల్లాలోని బాదంపూడి వంతెన సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
* ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఇందల్‌వాయి మండలంలోని జి.కె తండాలో సోమవారం జరిగింది. వాసు అనే మూడేండ్ల బాలిక ఆడుకుంటూ ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటి ముందు ఉన్న నీటి తొట్టిలో ప్రమాదవశాత్తు పడింది. కాసేపటికి కుటుంబసభ్యులు చిన్నారి కోసం వెతకగా బాలిక నీటి తొట్టిలో పడి ఉంది.
* బెంగళూరులో ఓ ప్రమాదం కానిస్టేబుల్ మృతిచెందాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ ఉన్నతాధికారితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో బసవన్నగూడి నుంచి అతివేగంగా వచ్చిన కారు ఉమామహేశ్వర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉమామహేశ్వర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
* ఓ మహిళా లెక్చరర్‌ను వేధింపులకు గురి చేస్తూ.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధిత లెక్చరర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసింది.
* అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు ఆమెను ఇంటికి తీసుకురావడమే కాకుండా తనపై దాడి చేయించడాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
* రైలు పట్టాలపై విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం కాశీబుగ్గలో చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్యతేజ ఇంటర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అనంతగిరి బదకల జయసూర్య అనే విద్యార్థి రైలు పట్టాలపై మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు…
* బీజాపూర్ జిల్లాలోని ఇరపల్లి గ్రామ సమీపంలో మావోయిస్టులకు, కోబ్రా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మావోయిస్టును కోబ్రా దళాలు హతం చేశాయి. బీజాపూర్ జిల్లాలో 204 బెటాలియన్‌కు చెందిన కోబ్రా దళాలు.. మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్ చర్యలు చేపట్టాయి. ఇరపల్లి గ్రామ సమీపంలో జవాన్ల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
*ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో ఉపాధ్యాయుడు అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం…లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన్న రామకృష్ణ(35) భార్య, పిల్లలతోకలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు ఇంట్లోకి చొరబడి రామకృష్ణ గొంతుకోసి పరారయ్యారు
*బిహార్‌లో ఓ ఇంట్లో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పట్నాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా ధ్వంసమైంది. ఇంట్లో అక్రమంగా దాచిన బాంబు వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని పట్నా పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
*గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఆటో, మినీ లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న ఆటోను, ఫిరంగిపురం నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎడ్లపాడు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కాకాని రమాదేవి(40), కాకాని యశస్వీని (11నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
*వెల్ల గ్రామంలోని మూడు పశువుల పాకలు దగ్ధమై. ఏడు గేదెలు, ఒక ఆవు మంటల్లో సజీవదహనమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో మూడు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పాకల్లో ఉన్న ఏడు గేదెలు, ఒక ఆవు మంటల్లో సజీవదహనమయ్యాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది..
*నా ను వణికిస్తున్న కరోనా వైరస్.ఆగని మృత్యుఘోష.వెయ్యి మందికి చేరుకున్న కరోనా వైరస్ మృతులు.40 వేలమందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి.6945 మంది పరిస్థితివిషమం.28 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్…
*వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగి రాజధానిపై మనసు మార్చుకోవాలని ఇద్దరు యువకులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భగ్నం చేశారు. వెలగపూడిలో బొర్రా రవి, తాడికొండ శ్రీకర్ 151 గంటల దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం నాటికి వీరి పరిస్థితి క్షీణించింది. బీపీ, చక్కెర స్థాయులు పడిపోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులను రాజధాని రైతులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు…
*ఆదివారం ఆటవిడుపు ఆ బాలుడి నుదుటన మరణ శాసనం రాసింది. దోస్తులతో కలసి క్రికెట్ ఆడుకోవాలనుకున్న ఆ కుర్రాడు… వాడిపారేసిన బంతుల కోసం గోడ దూకి టెన్నిస్ కోర్టులోకి ప్రవేశించాడు. తిరిగొచ్చే క్రమంలో విద్యుదాఘాతంతో అదే గోడపై విగతజీవిగా మారాడు. కొన్ని నెలల క్రితమే భర్తను కోల్పోయిన తల్లికి గర్భశోకం మిగిల్చాడు.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని యాంకరేజ్ పోర్టు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున నూకలు లోడుతో వెళ్తున్న స్టీల్ బార్జి (కేకేడీ81) ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగింది. నూకలు ఓడలోకి తరలించేందుకు కార్మికులు సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగిందని పోర్టు అధికారులు తెలిపారు. సముద్రంలో ఒక్కసారిగా గాలులు, అలలు ఎగసిపడడంతో బార్జిలోకి నీరు చేరి మునిగిపోయింది.
*షాపింగ్ మాల్‌లో కాల్పులు జరిపిన థాయ్‌లాండ్ సైనికుడు జక్రపంత్ థోమాను ఆదివారం భద్రతా దళాలు కాల్చి చంపాయి. శనివారం సాయంత్రం నుంచి 17 గంటల పాటు సైనిక శిబిరం, షాపింగ్ మాల్‌లో కాల్పులు జరపడంతో 30 మంది మరణించారు. షార్ప్‌షూటర్లు అతన్ని మాల్‌లోనే మట్టుపెట్టారు. ఇల్లు అమ్మకంలో తలెత్తిన వివాదం కారణంగానే అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.
*తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.శ్రీనివాసరావు నివాసంలో ఆదాయపు పన్ను విభాగం అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం ప్రారంభమైన తనిఖీలు నాలుగోరోజైన ఆదివారం కూడా జరిగాయి. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కేంద్ర భద్రతా బలగాల రక్షణతో ఈతనిఖీలు జరుగుతున్నాయి. వివిధ అంశాలపై శ్రీనివాసరావును ప్రశ్నించినట్లు సమాచారం.
*శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.5 కిలోల బంగారం బిస్కెట్లు తరలిస్తూ ఆదివారం నలుగురు మహిళలు పట్టుబడ్డారు. హైదరాబాద్‌కు చెందిన వారు గతంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లారు. స్వదేశానికి వస్తూ బంగారం బిస్కెట్లను తమ లోదుస్తుల్లో పెట్టుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరారు. బయటకు వస్తున్న వారి ప్రవర్తనపై అనుమానంతో భద్రతాధికారులు అప్రమత్తం అయ్యారు. అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా తనిఖీ చేయగా లోదుస్తుల్లో రహస్యంగా పెట్టుకుని తరలిస్తున్న బంగారం బిస్కెట్ల గుట్టు రట్టయింది. అవి 2.5 కిలోల బరువున్నాయి. మహిళలను అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు కోసం కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
*రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమారుడికి ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొస్తుండగా.. ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొనడంతో అయిదుగురు మృత్యువాత పడ్డారు
*బంతి కోసం వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీ నగర్‌కు చెందిన ఎం. అఖిల్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లోని టెన్నిస్ కోర్టు వద్ద ఎవరికీ తెలియకుండా బంతులను తీసుకొచ్చేందుకు వెళ్లాడు.
*కీసర మండలం రాంపల్లిదాయర ఔటర్రింగ్రోడ్డు మీద లారీ, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
*కొందరు దుండగులు ఓ వ్యక్తిని గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర ఘటన దుమ్ముగూడెం మండలం, లచ్చిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
*స్నానం చేస్తుండగా రహస్యంగా తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్న ప్రబుద్ధుడు ఒకవైపు, ఆగంతుకుడికి డబ్బులెందుకిచ్చావంటూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్న భర్త మరోవైపు.. ఈ పరిస్థితులకు విలవిలలాడి మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
*రాంనగర్లోని వైట్హౌస్ హోటల్ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నాగయ్య చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెత్తకుప్పలో ఉన్న పెయింట్ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘటనాస్థలిని పరిశీలించారు.
*డబుల్ బెడ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. నకిలీ పత్రాలతో వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.11 కోట్లు రికవరీ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తప్పుడు పత్రాలతో మోసం చేస్తున్న ఈ ముఠాను దుండిగల్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
*పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలో జరుగుతోన్న మతపరమైన ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా ఉంచిన ట్రాక్టర్లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు
*అసోం రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా జరిపిన స్విఫ్ట్ ఆపరేషన్లో భారీ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు అయింది. మాదకద్రవ్యాల తయారీ యూనిట్పై దాడి చేసిన అసోం రైఫిల్స్, పోలీసులు ఒకరిని అరెస్టు చేసి దాదాపు 29 కిలోల బ్రౌన్ షుగర్, 20 లీటర్ల లిక్విడ్ బ్రౌన్ షుగర్, ఇతర కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.
*కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర, కురిక్యాల గ్రామాల టాటాఏస్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఘటన సమాచారం తెలియడంతో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాట్నాలో భారీ పేలుడు-నేరవార్తలు
Related tags :