కామసూత్ర రాసిన వాత్స్యాయనుడు ఎన్నో వందల ఏళ్ల క్రితమే గ్రీకు సాహిత్యంలో ఉన్న ‘కామం’ అనే భావన గురించి విస్తృతంగా చర్చించారు.’కామం’ అనేది “ఒకరిపై అధికారం చూపించాలనే ఆకాంక్ష” అని ప్లేటో భావించారు.’సింపోజియం’లో గ్రీకు నాటక రచయిత అరిస్టోఫేన్స్ కూడా “ఒక మానవుడు ఇతరుల అవసరం లేకుండా, తనను తాను పరిపూర్ణంగా భావించిన ఒక కాలం గురించి” ప్రస్తావించారు.”అలా, మానవుడు తనకు తాను చాలా బలవంతుడుగా మారాడు. దేవతలకు కూడా సవాలు విసరడం మొదలుపెట్టాడు. దాంతో, దేవతల రాజు జాయస్ దాని నుంచి బయటపడ్డానికి ఒక పథకం వేశాడు. మానవుడిని పురుషుడు, స్త్రీ అనే రెండు భాగాలుగా విభజించాడు” అని చెప్పాడు.ఫలితంగా మనిషి నిటారుగా నిలబడడం ప్రారంభించాడు. రెండు కాళ్లపై నడిచేటపుడు. తన ముందున్న అంగాలు విభజనకు గురైనట్లు అతడికి అనిపించింది.ప్లేటో “ఆ అపరిపూర్ణత, మనలో విభజనకు గురైన మరో భాగాన్ని కూడా పొందాలనే కోరికను రగిల్చింది” అంటారు.”సెక్స్‌ను పరిపూర్ణత కోసం కలిగిన కోరిక”గా ప్లేటో చెప్పేవారు. “మనది కాని ఒక వస్తువును మనం ఇష్టపడతాం” అన్నారు.కానీ సెక్స్ ఎందుకూ పనికిరానిది అని కూడా చెప్పే ఒక కాలం కూడా వచ్చింది. ఆ సమయంలో సెక్స్ చెడ్డది, అది చేయడం పాపం అని భావించారు.క్రీ.శ 325లో “శరీరం ఒక పనికిరాని వస్తువు, శారీరక సుఖం అర్థంలేనిది, దాన్ని పొందాలనే కోరిక కలగడం పాపం” అని కాథలిక్ చర్చి తమ నియమ నిబంధనల్లో చెప్పింది.”సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానానికి జన్మనివ్వడం మాత్రమే” అని ఆ నిబంధనల్లో చెప్పారు.కానీ, దాదాపు అదే సమయంలో వాత్స్యాయనుడు గంగా తీరంలో కూచుని కామసూత్ర రాస్తున్నారు. “వాస్తవానికి, లైంగికానందం చాలా మంచిదని, దానిని మరింత పెంచడం ఎలా” అనేది చెబుతున్నారు.
శృంగారానికి విశ్వగురువు భారతదేశమే
Related tags :