* ఉత్తరప్రదేశ్ పోలీసుల వ్యవహారంపై సామాజిక ఉద్యమ కారిణి సుమియా రాణా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సతీశ్ రాణా తీవ్రంగా స్పందించారు. ‘‘నేటి భారతంపై ఆమెకు చాలా బాధగా ఉంటే పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అలీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. మిగితా వారు ఆందోళనను విరమించి తరగతులకు హాజరవుతున్నారని, అయితే, దాదాపు 150 మంది విద్యార్థులు ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారు క్యాంపస్‌లో ఉండరని పోలీసులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
* కియా యాజమాన్యాన్ని బెదిరించారు: దేవినేని
కియా యాజమాన్యాన్ని ప్రభుత్వం బెదిరించిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుండటంపై జగన్ సిగ్గుపడాలని అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్‌లో నిలదీసిన రామ్మోహన్ నాయుడిపై దాడికి యత్నించారని వైసీపీ ఎంపీల తీరుపై ధ్వజమెత్తారు. డీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ఆస్తుల కేసులో పనిచేసిన అధికారులను వెంటాడి వేధిస్తున్నారని, ఓ పథకం ప్రకారం దాడులు చేస్తూ వస్తున్నారని దేవినేని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో హోంశాఖ నడుస్తోందన్నారు. అంకితభావంతో పనిచేసిన అధికారులపై దాడులు చేయిస్తున్నారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వ్యవస్థలన్నీ కుప్పకూల్చి పాలన చేస్తున్నారని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో కక్షపూరిత కార్యక్రమాలు మొదలయ్యాయని, ప్రజావేదిక శిథిలాలన్నీ ఇంకా అక్కడే ఉన్నాయని అన్నారు.
* పేదలకు ఇళ్లు కట్టిస్తాం: మంత్రి బొత్స
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేసి పేదలకు ఇళ్లు కట్టిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలో భూమి లభ్యత లేదని, అసైన్డ్ భూముల్ని గుర్తించాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. విశాఖలోని 10 మండలాల్లో 6,116 ఎకరాలు గుర్తించామని, అసైన్డ్ భూములపై సాగు హక్కు మాత్రమే ఉంటుందని తెలిపారు. రెవెన్యూ, సర్వే, అటవీశాఖతో కూడిన 38 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 2 లక్షల 47 వేల 13 మంది ఉన్నారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
* శాసనమండలి సెక్రటరీని బెదిరించారు: టీడీపీ ఎమ్మెల్సీలు
శాసనమండలి సెక్రటరీని ప్రభుత్వ పెద్దలు బెదిరించారని టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. మండలి సెక్రటరీలో ఆందోళన, భయం కనిపించిందని తెలిపారు. ఆ కారణంగానే మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సెక్రటరీ పక్కన పెట్టారని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. సీఆర్డీయే బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలంటూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు.
* పేదలకు ఇళ్లు కట్టిస్తాం: మంత్రి బొత్స
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేసి పేదలకు ఇళ్లు కట్టిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలో భూమి లభ్యత లేదని, అసైన్డ్ భూముల్ని గుర్తించాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. విశాఖలోని 10 మండలాల్లో 6,116 ఎకరాలు గుర్తించామని, అసైన్డ్ భూములపై సాగు హక్కు మాత్రమే ఉంటుందని తెలిపారు. రెవెన్యూ, సర్వే, అటవీశాఖతో కూడిన 38 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 2 లక్షల 47 వేల 13 మంది ఉన్నారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
* రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది:బుచ్చయ్య
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతోందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఎనిమిది నెలల జగన్ పాలనతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని.. ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 55వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాజధాని పోరాటానికి సంఘీభావంగా రాజమహేంద్రవరం నుంచి 50కార్లలో తెదేపా నాయకులు అమరావతికి బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… రాజధాని అంశంపై రైతులు 55 రోజులుగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బుచ్యయ్య మండిపడ్డారు.
* ‘కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదు’
సీఎం జగన్ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల పాలనలోనే జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని.. మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్.. ప్రత్యేకోహోదా కోసం 22 మంది వైకాపా ఎంపీలతో ఎందుకు లోక్‌సభను స్తంభింపజేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకు లేదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మీడియా సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్ వలి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.
* టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్.
నాగార్జున యూనివర్సిటీ లో విద్యార్థులు పై దాడులు సరికాదు.ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేస్తారా.వైస్ ఛాన్సలర్ ప్రవర్తన దారుణంగా ఉంది.విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతారా.వైన్ ఛాన్సలర్ సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయి.వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారు.వైస్ ఛాన్సలర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి.శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు.యూనివర్సిటీని స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారు.సీఎం జగన్ సైకో . ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు.హిందూ పత్రిక నిర్వహించిన సర్వేలో 86 శాతం ప్రజలు రాజధాని తరలింపును వ్యతిరేకించారు.విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నారు.
సీఎం ఆలోచలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఎవరు ఇచ్చారు.వైస్ ఛాన్సలర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎ బి వెంకటేశ్వరవు పై కక్ష చర్యలు సరికాదు.అధికారులకు జీతాలు,పోస్టింగ్ లు ఇవ్వడం లేదు.
40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదు.సీఎం చెప్పిన పనిని చేయడమే అధికారుల విధి.సీనియర్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం దారుణం.అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం ఐటి దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం.
*ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరం..!
దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తిరిగి అధికారంలోకి రాబోతోందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వేళ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆప్‌తో పొత్తు విషయంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని ఖండిస్తూనే.. మరోవైపు పొత్తుపై ఫలితాల అనంతరం నిర్ణయిస్తామని చెబుతున్నారు. మరోవైపు ఆప్‌తో కలిసే ప్రసక్తే లేదని మరికొంత మంది నేతలు వాదిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత పీసీ.చాకో మాట్లాడుతూ..‘‘ఎన్నికల ఫలితాలను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే ఊహించడం అనేది సమంజసం కాదు. ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం’’అని అన్నారు.
*వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాకుసిద్ధమా?:బుద్ధా
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబును మాధవ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాధవ్ వ్యవహార శైలితో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. మాధవ్‌ను నియోజకవర్గం నుంచి ఎప్పుడు సాగనంపుదామా అని హిందూపురం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అవినీతి గురించి ఆయన పనిచేసిన ప్రతి పోలీస్ స్టేషన్‌లో చెప్తారన్నారు. అమరావతి ప్రజాభిప్రాయ సేకరణపై విశాఖ జిల్లాలోని నలుగురు తెదేపా ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాజీనామా చేసే దమ్ముందా?అని బుద్ధా సవాల్ విసిరారు.
*3 నెలలకు మించి నిరీక్షణలో ఉంటే జీతాలివ్వకపోవడం దుర్మార్గం: చంద్రబాబు
మూడు నెలలకు మించి నిరీక్షణలో ఉంటే ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం వైకాపా ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ఠ అని ప్రతిపక్షనేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులో వైకాపా నేతల ఉన్మాదం చల్లారలేదు. అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వోద్యోగులపైనే ఫ్యాక్షనిస్టు పంజా విసిరారు. పోస్టింగులు ఇవ్వకుండా వందల మంది పోలీసు అధికారులు, సిబ్బందిని 8 నెలలుగా వేధిస్తున్నారు. ఇప్పుడు జీతాలు ఇవ్వబోమనడం దారుణం. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఈ ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని చంద్రబాబు ఆదివారం ట్విటర్లో మండిపడ్డారు.
*శాసనసభ విప్గా గంప గోవర్ధన్ బాధ్యతల స్వీకరణ
శాసనసభ విప్గా కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆదివారమిక్కడ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు ఆయన్ను అభినందించారు. తనపై నమ్మకం ఉంచి విప్ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటానని, ఆయన సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని గోవర్ధన్ ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విప్గా రాణించి మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
*అలాంటి వారికి మనుగడే ఉండదు:యనమల
ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గపు చర్యని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులపై అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం ఇలా కక్ష సాధించడం గర్హనీయమన్నారు. ఈ మేరకు యనమల ట్వీట్ చేశారు. కులం, పార్టీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బలిపెడుతున్నారని.. ఉద్యోగులకు రాజకీయాలను ఆపాదించరాదని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన అధ్వాన స్థితికి చేరిందని.. ఇలాంటి కక్ష సాధింపు వైఖరితో ఏపీ సర్వనాశనమవుతుందన్నారు. అధికారులు, ఉద్యోగులపై వ్యక్తిగత కక్ష తగదని యనమల సూచించారు. 58 మంది డీఎస్పీలు, 100 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది అదనపు ఎస్పీలను 8 నెలలుగా వెయిటింగ్లో పెట్టడం దుర్మార్గమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
*చంద్రబాబు ప్రయోజనాలకే ఏబీ పనిచేశారు’
ప్రజల రక్షణకు కాకుండా తెదేపా అధినేత చంద్రబాబు ప్రయోజనాల కోసమే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని వైకాపా ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైకాపాను దెబ్బతీయడానికే నిఘా వ్యవస్థను వినియోగించారని ట్విటర్ వేదికగా ఆయన ఆక్షేపించారు. గతంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు దళారీగా పనిచేశారని సజ్జల వ్యాఖ్యానించారు. పరికరాలు కొని తనతో సహా వైకాపా నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ మాఫియాను నడిపారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన అక్రమాలను తెదేపా ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
*బల్క్ డ్రగ్స్ దిగుమతులపై నిషేధం లేదు: కిషన్రెడ్డి
బల్క్ డ్రగ్స్ దిగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘చైనా నుంచే కాదు. మరే ఇతర దేశాల నుంచి వచ్చే బల్క్ డ్రగ్స్ దిగుమతులపైనా ఎలాంటి నిషేధమూ విధించలేద’ని ఆయన స్పష్టీకరించారు. ఈ అంశంపై ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. కరోనా వైరస్ ప్రభావం చైనా నుంచి దిగుమతి అయ్యే బల్క్ డ్రగ్స్పై ఏమీ లేదని, అందువల్ల వాటిపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు.
పాకిస్థాన్ పోండి-రాజకీయం
Related tags :