ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు.. జొమాటో పేరుతో సైబర్‌నేరగాళ్లు రూ.50 వేలు బురిడీ కొట్టారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడకు చెందిన వినయ్(పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శనివారం జొమాటో యాప్‌లో రూ. 149 విలువైన చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు… ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో కేవలం సాధారణ రైస్ మాత్రమే ఉంది. వెంటనే జొమాటో యాప్‌ను సంప్రదించాడు. కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సర్చ్ చేయగా కొన్ని నంబర్లు కన్పించగా.. ఫోన్ చేశాడు. ఆ తరువాత జొమాటోలో ఎలా ఫిర్యాదు చేయాలనే విషయంపై ఆరా తీయగా.. యాప్‌లోనే హెల్ప్ డెస్క్ ఉంటుందని గుర్తించి.. దాని ద్వారా చాటింగ్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. జొమాటో యాప్ నుంచి.. మేం ఈ విషయాన్ని తెలుసుకొని.. పొరపాటు జరిగినట్లు నిర్ధారణ అయితే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ చాటింగ్‌లో సూచించారు. మరుసటి రోజు వినయ్‌కి కాల్ వచ్చింది.. మేం జొమాటో కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని అంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. వినయ్ జరిగిన విషయాన్ని వివరించాడు. మీకు డబ్బులు పంపిస్తాం… ముందుగా గూగుల్ పే ద్వారా మీకు ఒక రూపాయి టెస్టింగ్ కోసం పంపిస్తాం.. ఆ తరువాత మీకు రావల్సిన మొ త్తాన్ని పంపిస్తాం చెక్ చేసుకోండంటూ సూచించారు. ఈ క్రమంలోనే సైబర్‌నేరగాళ్లు ఒక లింక్‌ను పంపించారు. దాన్ని క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు రూ. 50 వేలు రెండు దఫాలుగా మాయమయ్యాయి. అయితే ఖాతాలో ఉన్న డబ్బు లు మొత్తాన్ని కాజేసేందుకు సైబర్‌నేరగాళ్లు ప్రయత్నించారు, అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన బ్యాంకు నుంచి వినయ్‌కు కాల్ వచ్చింది. మీ ఖాతాలో నుంచి డబ్బులు డ్రా చేశారు.. అది మీరేనా? అంటూ అడిగారు, నేను ఫోన్ చేయలేదని, వెంటనే బ్లాక్ చేయండంటూ చెప్పడంతోనే నిందితులు డ్రా చేసేందుకు ప్రయత్నించిన మరో రూ. 45 వేలు ఆగిపోయాయి. సోమవారం బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రాంరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఎలా మోసం ఎలా జరిగిందనే విషయంలో స్పష్టత ఇవ్వక పోలీసులను కూడా తికమక పెట్టే ప్రయత్నం చేశాడు.
బిర్యానీ ఆర్డర్ ఇస్తే ప్లెయిన్ రైస్ ఇచ్చి ₹50వేలు దోపిడీ
Related tags :