DailyDose

జేసీ ప్రాణాలకు ముప్పు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-JC Diwakar Reddy Security Reduced

* టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను ప్రభుత్వం తొలగించింది.గతంలో గన్‌‌మెన్‌లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా పూర్తి భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహిస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగానే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు జేసీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడంతో పాటు, జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూముల రద్దుతో పాటు ఇతర కేసులు నమోదు అయ్యాయి.
ఇదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రధాన అనుచరులపైనా పోలీసులు కేసులు పెట్టడం, పీడీయాక్ట్‌లు పెట్టి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంపై జేసీ బ్రదర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని పలుమార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే.
* కృష్ణా జిల్లాపెనమలూరు నియోజకవర్గంఉయ్యూరు మండలంలో అంతర్ రాష్ట్రముట బరితెగింపు.కాటూరు గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి కత్తులు, మారణాయుధాలతో బెదిరించి చోరీ.ఓ ఇంట్లో చోరీకి పక్కా ప్రణాళికతో వచ్చి వేరే ఇంట్లోకి ప్రవేశించిన వైనం.ఒడిస్సా భాషలో మాట్లాడారని తెలిపిన బాధితుడు ఆరేపల్లి రజిని కాంత్.ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్న సీపీ ద్వారకా తిరుమలరావు.ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్, రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్.
* కామారెడ్డి జిల్లా . బి బి పేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఐదు గోవులను హతమార్చి గొంతు కోసి మాంసాన్ని తరలించడానికి సిద్ధమవుతున్న సమయంలో అటుగా వెళ్ళిన గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న బీబీపేట ఎస్ఐ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న భజరంగదళ్ బిజెపి కార్యకర్తలు ఈ సంఘటనకు సంబంధించిన బాధ్యతలను వెంటనే శిక్షించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి బజరంగ్దళ్ గ్రామస్తులు పాల్గొన్నారు
* గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదంనరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటో.. ఢీకొన్న లేలాండ్ ఆటో….ఫిరంగిపురం మండలం రేపూడి ఇంజనీరింగ్కాలేజ్ దగ్గర ఆటో ను ఢీకోన్న మినీ లారీ… ఘటనా స్థలంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.మృతులు నరసరావు పేట శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన. చోటు చేసుకుంది.మృతులు ఫిరంగిపురం మండలం పుట్టకోట గ్రామానికి చెందినవారుగా గుర్తింపు.
* ముసునూరు మండలంలో కోడి పందాలపై దాడి నూతనంగా వచ్చిన ఎస్ఐ కొవ్వూరు రాజా రెడ్డి తన సిబ్బందితో కలిసి లో పూడి తమ్మిలేరు సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాలపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 2100-/నగదు 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
* ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసులో దోషిగా తేలిన బ్రజేశ్‌ ఠాకూర్‌కు దిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడు సహజ మరణం పొందే వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన మరో 18 మందిలో 11 మందికి కూడా జీవిత ఖైదు విధించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహంలోని బాలికలపై లైంగిక దాడి, అత్యాచారం కేసులో ఠాకూర్‌ ప్రధాన దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడితో పాటు మరో 18 మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని గతంలోనే నిర్దోషిగా ప్రకటించింది.
*ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్‌ ఓవైసీపై దాడి చేసిన మహమ్మద్‌ పహిల్వాన్ మంగళవారం మృతి చెందారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన కేసులో అరెస్ట్‌ అయిన పహిల్వాన్ బెయిల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే.ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్ధీన్‌ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. పలు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ సమయంలో అక్బరుద్దిన్‌ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్‌ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్‌ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. అక్బరుద్ధీన్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి విదితమే.
* రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని బిగోడ్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా నుంచి కోటా జిల్లాకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు మార్గ మాధ్యలో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బిల్వారాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
* పెండ్లిమర్రి మండలంలోని మాచునూరు గ్రామ పంచాయితీలోని అరవేటిపల్లె గ్రామానికి అరవేటి నరసింహరెడ్డి(15) అనే విద్యార్థి సోమవారం అత్మహత్య చేసుకున్నాడు.
* విహారయాత్ర విషాదం నింపింది. ఫ్రెండ్స్ తో పాండిచ్చేరి టూర్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అక్కడి బీచ్ లో గల్లంతయ్యాడు. కుషాయిగూడ సాయినగర్ కు చెందిన నిఖిల్ రెడ్డి(22) గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే 10 మంది ఫ్రెండ్స్ తో కలిసి శనివారం పాండిచ్చేరి టూర్ కు వెళ్లారు
* పోలీసులమంటూ బస్సులో మహిళా ప్రయాణికురాలిని బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు జహీరాబాద్‌ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
* మహారాష్ట్రలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత సోమవారం చనిపోయింది. కాలిన గాయాలతో ఓ ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. 40శాతం గాయాలయ్యాయని, ఆమె బాడీ మొత్తం సెప్టిక్కు గురయిందని అక్కడి డాక్టర్లు వెల్లడించారు.
* విందులో ఆహారం వికటించి వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. యూపీలోని బదాయూ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలో ఆదివారం జరిగిన విందులో 450 మంది పాల్గొన్నారు. ఆహారం తిన్నాక.. వాంతులు, కడుపునొప్పితో 290 మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.
* రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు-సిగడం రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
* పామిడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన భూమికి చెందిన పాస్‌బుక్‌ ఇవ్వడం లేదంటూ.. గజరాంపల్లికి చెందిన మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
* వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
* వరంగల్‌ అర్బన్ ‌జిల్లా హసన్‌పర్తిలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. హసన్‌పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణికులతో హన్మకొండ వైపు వెళ్తున్న ఆటోను, వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ హసన్‌పర్తి ఎస్‌బీఐ సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్‌(20), గట్టమ్మ అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
* శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు-జి.సిగడం రైల్వే స్టేషన్ల మధ్య వాన్రంగి రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు పొందూరుకు చెందిన కె.ఉపేందర్‌(18)గా స్థానికులు గుర్తించారు. ఉపేందర్‌ స్థానిక ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ(కు కొన్ని రోజులుగా జ్వరందగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం బాలకృష్ణ (చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేరాడు. బాలకృష్ణకు అన్ని పరీక్షలు నిర్వహించిన రుయా వైద్యులు సాధారణ జ్వరమేనని తేల్చి చెప్పి.. ఇంటికి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఊరికి వెళ్లిన బాలకృష్ణ పొలంలో తల్లి సమాధి దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
* బండి ఆత్మకూరుమండలంలోని కడమలకాల్వకు చెందిన మనీషా(20) ఆత్మహత్యకు పాల్పడింది.
* మందడం జెడ్పీ హైస్కూల్‌ ఘటనలో.. జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్‌ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రిపోర్టర్‌, ఫొటోగ్రాఫర్‌కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్‌, జర్నలిస్టుల మధ్య కనీసం సంభాషణ కూడా జరగలేదని పేర్కొంది. పైఅధికారి ఆదేశాలతోనే ఫిర్యాదు చేశానని కానిస్టేబుల్‌ చెప్పారని… ఇలాంటి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా.. రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో బందోబస్తు కోసం మందడం వచ్చిన పోలీసులు స్కూల్‌లో విద్యార్థులను బయటకు పంపి గదులను ఆక్రమించిన విషయం తెలిసిందే. అయితే దీనిని చిత్రీకరించిన మీడియా ప్రతినిధులపై కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జర్నలిస్టుల తరపున సీనియర్ లాయర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ వాదించారు.
*నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఖాజామైనోద్దీన్ (20), కురుమూర్తి(17) గ్రామసమీపంలోని బావాజీపల్లికి వెళ్లే దారిలో కరిగెట దున్నడానికి ట్రాక్టర్పై వెళ్లారు. డ్రైవర్గా పనిచేస్తున్న ఖాజామైనోద్దీన్ బధిరుడు. కాగా కేజీవీల్స్ ట్రాక్టర్ వెనుక తగిలించుకుని వస్తున్న క్రమంలో స్థానిక ఊర చెరువు కట్ట ఎక్కుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ట్రాక్టర్ మీద పడి, నలిగిపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కురుమూర్తి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
*ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళా లెక్చరర్ అంకిత సోమవారం తుదిశ్వాస విడిచారు. వారంరోజులుగా ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. శ్వాసనాళిక తీవ్రంగా దెబ్బతినడంతో ముంబయి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు నాలుగు శస్త్రచికిత్సలు చేశారు. కృత్రిమ శ్వాస అందించి ఆమె ప్రాణాలు నిలబెట్టడానికి కృషి చేశారు.
* ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడితో పాటు.. బస్సులో ఉన్న ఒక వ్యక్తి కూడా మరణించారు. కడప జిల్లా రైల్వేకోడూరులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. కడప డిపోకు చెందిన ఆర్టీసీ నాన్స్టాప్ సూపర్ డీలక్స్ బస్సు 7.30 గంటలకు కడప నుంచి తిరుపతికి బయలుదేరింది.
*తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం కోబ్రా బెటాలియన్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు జవాన్లతో పాటు ఓ మావోయిస్టు చనిపోయారు. కూంబింగ్కు వెళ్లిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో జవాన్లు వికాస్, పూర్ణానంద్ సాహు మరణించారు. డిప్యూటీ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ సహా ఆరుగురు జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హెలికాప్టర్లో రాయపూర్కు తరలించారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టుల వేటకు పెద్దఎత్తున సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సమీప అటవీ ప్రాంతాలకు వెళ్లాయి.
*ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పెన్గంగా సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం ఉదయం వేళ తాంసి-కె పరిసరాల్లో ఆర్టీసీ డ్రైవర్కు పులి కనిపించింది. సాయంత్రం గొల్లఘాట్ అటవీ ప్రాంతంలో గోవును హతమార్చింది. ఆయా గ్రామాలకు వెళ్లే ఉపాధ్యాయులు భయంతో పిప్పల్కోటి గ్రామం వద్ద ఆగిపోయారు.
*తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవల నకిలీ టికెట్లతో భక్తులను మోసగించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైకి చెందిన భక్తుడు రవినారాయణన్ తనకు శ్రీవారి సేవల టికెట్లను ఇప్పించాలని బంధువైన భరత్ను కోరారు. భరత్ తనకు తెలిసిన లక్తిక్, రాహుల్ను పరిచయం చేసి, వారు టికెట్లు ఇస్తారని చెప్పారు. రవినారాయణన్ తన కుటుంబసభ్యుల కోసం 18 అభిషేకం, 10 సుప్రభాతం టికెట్ల కొనుగోలుకు రూ.73 వేలను ఆన్లైన్ ద్వారా లక్తిక్, రాహుల్కు చెల్లించారు. వారు ఆన్లైన్లో టికెట్లను పంపించారు. గత డిసెంబరు 13న రవినారాయణన్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. స్వామివారి సేవల్లో పాల్గొనేందుకు వెళ్లగా తితిదే విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో అవి నకిలీ టికెట్లని తేలింది. తాము మోసపోయామని తెలుసుకున్న రవినారాయణన్ సోమవారం తితిదే విజిలెన్స్ అధికారులను సంప్రదించి జరిగిందంతా వివరించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
*తన కుమార్తె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందన్న అవమాన భారంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్చిరోలి పట్టణంలోని వివేకానందనగర్లో రవీంద్ర వరగంటివార్ కుటుంబం నివాసముంటోంది. ఆదివారం ఈయన కుమార్తె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. ఈ విషయమై పరిసరాల్లో చర్చనీయాంశమైంది. దీన్ని అవమానంగా భావించిన రవీంద్ర వరగంటివార్(50), భార్య వైశాలి (43), కుమారుడు సాయిరాం(19) పట్టణ శివారు సోమానా బైపాస్ వద్ద ఆనందనగర్ పరిసరాల్లోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
*అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఓ రైతు ఏర్పాటుచేసుకున్న కంచె మరో రైతు ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో సోమవారం ఈ ఘటన జరిగింది.
*వ్యాయామ ఉపాధ్యాయుణ్ని ఓ వివాహిత.. పాఠశాల ఆవరణలోనే చెప్పుతో కొట్టిన సంఘటన సోమవారం గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగింది.
*తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పి.శ్రీనివాసరావు నివాసంలో ఆదాయపు పన్ను విభాగం అధికారుల సోదాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల 6న మొదలైన తనిఖీలు మొత్తం 5 రోజుల పాటు కొనసాగాయి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఐటీ అధికారులు శ్రీనివాసరావు ఇంటి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలు పత్రాలను తమతో పాటు తీసుకెళ్లారు.
*తెలంగాణ గ్రామీణ నీటిపారుదల కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు చెల్లించిన రూ. 55.93 లక్షల ధరావతు సొమ్ము (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను ఇద్దరు పొరుగుసేవల సిబ్బంది అత్యంత తెలివిగా స్వాహా చేశారు. ఏకంగా తమ కార్యనిర్వాహక ఇంజినీర్ సి.వి.రమేష్బాబు పేరుతో ఖాతా తెరిచి మరీ ఈ మోసానికి పాల్పడడం విశేషం.
*రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం ఈ ఘటన జరిగింది. నులి పురుగుల మాత్ర వేయడంతోనే తమ కుమార్తె అస్వస్థతకు గురై చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
*ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి.. ప్లాస్టిక్ నీళ్ల క్యాన్లో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జీకే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన మెగావత్ వసంత్, మాల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వసంత్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లు పాఠశాలకు వెళ్లగా తల్లి అనారోగ్యంతో ఇంట్లో నిద్రిస్తోంది. ఏడాదిన్నర పాప ఆడుకుంటూ నీటి క్యాన్లో పడిపోయింది. దీంతో చుట్టు పక్కల వాళ్లు గమనించి ఇందల్వాయిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.
*కరీంనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గొంతుకోసి హతమార్చాడు. కరీంనగర్లోని విద్యానగర్లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ముత్తా రాధికగా గుర్తించారు.
*బంధుమిత్రులతో సందడిగా ఉన్న వివాహ విందులో ఓ సంచి(బ్యాగు) నిమిషాల వ్యవధిలోనే అపహరణకు గురైంది. గుర్తుతెలియని యువజంట ఈ చోరీకి పాల్పడినట్లు ఫంక్షన్హాల్లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.