అండర్ –19 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం మైదానంలో గొడవకు దిగిన యువ క్రికెటర్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారణమైన ఐదుగురు ప్లేయర్లను గుర్తించింది. వారిలో ముగ్గురు బంగ్లా క్రికెటర్లు, ఇండియా యంగ్ స్టర్స్ ఆకాశ్ సింగ్ , రవి బిష్నోయ్ ఉన్నారు . ఈ ఐదుగురిపై ఐదు నుంచి పది సస్పెన్షన్ పాయింట్లు విధిస్తూ మ్యాచ్ రెఫరీ గ్రేమ్ లాబ్రూయ్ నిర్ణయం తీసుకున్నారు . ఆకాశ్, బిష్నోయ్‌తో పాటు బంగ్లాకు చెందిన తౌహిద్ హ్రిదయ్ , షమీమ్ హుస్సేన్, రకీబుల్ హసన్.. ప్లేయర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మూడో లెవెల్ తప్పిదానికి పాల్పడి, ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించారని ఐసీసీ ప్రకటించింది. ఇండియా ప్లేయర్ రవి బిష్నోయ్ అదనంగా ఆర్టికల్ 2.5 కూడా ఉల్లంఘించాడని తెలిపింది. వీరంతా తమ తప్పిదాన్ని అంగీకరించారని చెప్పింది. ఆకాశ్‌పై ఎనిమిది సస్పెన్షన్ పాయింట్లు పడగా.. ఇవి ఆరు డీ మెరిట్ పాయింట్లకు సమానం.రెండేళ్ల పాటు ఇవి ఆకాశ్ ఖాతాలో ఉండనున్నాయి. ఓ సస్పెన్షన్ పాయింట్ ఒక ఇంటర్నేషనల్ వన్డే లేదా టీ20కి గానీ, అండర్ -19 లేదా ఎ–-టీమ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ సస్పె న్షన్‌కు సమానం. బిష్నోయ్ ఐదు సస్పె న్షన్ పాయిం ట్లు అందుకోగా.. ఇవి ఐదు డీమెరిట్ పాయింట్లకు సమానం. అలాగే, 23వ ఓవర్లో బంగ్లా క్రికెటర్ అవిషేక్ దాస్ ను ఔట్ చేసిన తర్వాత అతిగా స్పందించి లెవెల్ 1 తప్పిదం చేసినందుకు గాను బిష్నోయ్ అదనంగా మరో రెండు డీమెరిట్ పాయింట్లు ఎదుర్కొన్నాడు. దాంతో, ఓవరాల్‌గా ఈ రెండేళ్ల కాలంలో అతని ఖాతాలో ఏడు డీమెరిట్ పాయింట్లు ఉంటా యి. ఇక, బంగ్లాదేశ్ క్రికెటర్లలో తౌహిద్ అత్యధికంగా పది సస్పెన్షన్ పాయింట్లు (6 డీమెరిట్ కు సమానం) ఎదుర్కో గా, హమీమ్ హుస్సేన్ ఖాతాలో ఎనిమిది పాయింట్లు (6 డీమెరిట్ కు సమానం) చేరాయి. రకీబుల్ హసన్‌పై ఐదు డీమెరిట్ పాయింట్లకు సమానమైన నాలుగు సస్పె న్షన్ పాయింట్లను ఐసీసీ విధించింది. కాగా, రాబోయే రోజుల్లో ఈ ఐదుగురు క్రికెటర్లు పాల్గొనబోయే సీనియర్ , అండర్ –19 లెవెల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో ఈ సస్పెన్షన్ పాయింట్లను అమలు చేస్తారు.
యువ ఆవేశపరులపై ఐసీసీ చర్యలు
Related tags :