ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివశిస్తున్న భారతీయుల వివరాలను సోమవారం లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లండించింది. మినిస్ట్రీ నివేదిక ప్రకారం మొత్తం 1.36 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఇండియన్స్ అత్యధికంగా నివశిస్తున్న టాప్-10 దేశాల జాబితాలో యూఏఈ 34, 20, 000 మందితో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా సౌదీ అరేబియా- 25,94,947, అమెరికా- 12,80,000, కువైట్- 10,29,861, ఒమన్- 7,79,351, ఖతార్- 7,56,062, నేపాల్- 5,00,000, బ్రిటన్- 3,51,000, సింగపూర్- 3,50,000, బహ్రెయిన్- 3,23,292 ఉన్నాయి. అలాగే భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) నివేదిక ప్రకారం విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు 2018-19 వార్షికంలో మొత్తం 76.4 బిలియన్ డాలర్లు(రూ. 5.57 లక్షల కోట్లు) ఇండియాకు పంపించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక 2015 నుంచి 2019 వరకు 125 దేశాల్లో సుమారు 21, 930 భారతీయులు మరణించగా.. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపింది.
అమెరికాలో కన్నా అరేబియాలోనే అధికం
Related tags :