*ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మర్చి పదిహేను లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించాలని ఏపీ మంత్రిమండలి ఈ ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావం లేకుండా చూడాలని ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎనికల్లో పోటీ చేసే అభ్యర్ధి మద్యం డబ్బుతో పట్టుబడితే అతడు లేదాఆమే ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు అలా పట్టుబడిన అభ్యర్ధికి మోడెళ్ళు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే అభ్యర్ధిపై అనర్హత వేటు పడేలా నిర్ణయం తీసుకున్నారు.
* ఎన్నికల పథకంగా రైతుబంధు: రేవంత్‌రెడ్డి
జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ జరిపిన సమావేశంలో రైతుల ప్రస్తావనే రాలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కనీసం ప్రస్తావించలేదని పేర్కొంటూ సీఎం వైఖరిపై రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో రైతుల ఆత్మహత్యలు, అన్నదాతల కష్టనష్టాలను ప్రస్తావించారు. దాదాపు 11 గంటలపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో 5 నిమిషాలైనా రైతుల గురించి చర్చించేందుకు సమయం దొరకలేదా అన్ని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై చర్చ జరిగితే రుణమాఫీ, రైతుబంధు మద్దతు ధర తదితర పథకాల అమలులో దొర్లుతున్న లోపాలు వెలుగులోకి వస్తాయనే సమీక్ష చేయలేదని రేవంత్ విమర్శించారు.
* ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయ్’
చట్ట సభల్లో రూపొందించిన శాసనాలనే అధికారులు ధిక్కరించే పరిస్థితి వైకాపా ప్రభుత్వంలోనే చూస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కియా పరిశ్రమ పరిశీలనకు అనంతపురం జిల్లాకు వచ్చిన రామకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగట్టారు. వైకాపాకు చట్టసభల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులపై అసెంబ్లీలో ఆమోదం చేయించారని మండిపడ్డారు. రాజ్యాంగంలో శాసనసభకు ఎలాంటి అధికారాలున్నాయో అవే శాసనమండలికి కూడా ఉన్నాయన్న విషయం వైకాపా ప్రభుత్వం గుర్తించడంలేదని ఆక్షేపించారు. కియా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం భూములిస్తే.. జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.
* ఆ అధికారం ఎవరికీ లేదు: యనమల
శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్ కమిటీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించే అధికారం ..అధికారులతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘనతోపాటు రాజ్యాంగ వ్యతిరేక విధానాల కిందకు వస్తుందన్నారు. సభా వ్యవహారాలకు విరుద్ధంగా వెళ్లే అధికారం ఏ అధికారికీ లేదని యనమల అన్నారు. అలా వ్యవహరించే వారు సభ తీసుకునే నిర్ణయాలకు బాధ్యులేనని యనమల పేర్కొన్నారు.
*ఆప్ మహిళా ఎమ్మెల్యేలు వీరే..
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నెల 16న కొలువుదీరనుంది. ఆప్ 62 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇందులో 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ తరపున 9 మంది మహిళలు పోటీ చేయగా 8 మంది గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఐదుగురికి, కాంగ్రెస్ పార్టీ 10 మంది మహిళలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆప్ తరపున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు.. అతిషి మర్లేనా(కల్కాజీ), ధనవతి చాందేలా(రాజౌరీ గార్డెన్), రాజ్‌కుమార్ ధిల్లాన్(హరినగర్), బండానా కుమారి(శాలీమర్బాగ్), ప్రీతి తోమర్(త్రినగర్ సిటీ), భావన గౌర్(పాలం), ప్రమీలా తోకస్(ఆర్కే పురం), రాఖీ బిర్లా(మంగోల్‌పూరి). కాగా సరితా సింగ్ అనే అభ్యర్థి రోహతస్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్ మహాజన్ గెలిచారు. ఆప్ తరపున గెలిచిన 8 మంది మహిళా ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతురాలు ధనవతి చాందేలా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 593 మంది పురుషులు, 79 మంది మహిళలు పోటీ పడ్డారు.
* సీఎం నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. నితిశ్ పోస్టర్లతో పాటుగా ఆర్జేడీ చీఫ్ లాల్ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా కూడా పోస్టర్లు దర్శనమిచ్చాయి. వీరిద్దరి పాలనలో రాష్ట్రం నాశనమైనట్టు అర్థానిచ్చే పోటోలను వేసి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.
*ఓటమికి నైతిక బాద్యత డిల్లి కాంగ్రెస్ చీఫ్ రాజేనామ
శాసనసభ జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. గెలుపు తమదేనని చివరి వరకు మేకపోతు గంభీర్యం ప్రదర్శించిన భాజపా గతంలో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికి భాజపా గతమతో ఆమడ దూరంలో నిలిచింది. ఇక ఎన్నికలకు ముందే కాడిపదేసిన కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఆపార్టీకి పోలిన ఓట్ల శాతం కూడా గణనీయంగా పడిపోయింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9.7 శాతం ఓట్లు పోలవగా ఈసారి అది 4.57శాతానికి దిగజారింది.
* మంత్రి పేర్ని నాని….. క్యాబినెట్ బ్రీఫింగ్ …
ప్రభుత్వం సమాజంలో ని పేదల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు జగన్ ప్రభుత్వం తీసుకుంటొంది. పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణ కు విప్లవాత్మకమైన నిర్ణయం. తీసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అభ్యర్థులపై మూడు సంవత్సరాల శిక్ష అదనంగా అనర్హత వేటు 13 ఎంపీటీసి 15 రోజుల్లో ఎన్నిక సర్పంచ్ 5 ఎంపిటిసి జెడ్పీటీసి 7 రోజులు ప్రచార సమయంపారిశుద్ధ్యం పచ్చదనం బాధ్యత సర్పంచ్ దే. సర్పంచ్ స్థానికంగా కాపురం వుండాలి. రోజు పంచాయితీ కార్యాలయం వెళ్లాలి. పంచాయితీ తీర్మానం అవసరం లేకుండా పంచాయితీ తీర్మానం అవసరం లేకుండా మౌఖిక ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికల నియమావళి మీరుతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై. ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కు ఆమోదం.
* ఢిల్లీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. పీసీ చాకో రాజీనామా…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలను చవిచూస్తుండడంతో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ పరాభవానికి దివంగత మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ చాకో ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.1998 నుంచి 2013 వరకు షీలా దీక్షింత్ ఢిల్లీ సీఎంగా కొనసాగారు. అయితే 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీ రంగప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ వైభవం తగ్గుతూ వచ్చింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ.. తాజా ఎన్నికల్లో కూడా ఖాతా తెరవలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాకో నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం ఆమాద్మీకి మళ్లిందని చెప్పుకొచ్చారు.
* ఆయన చేసిన పాపాలను దేవుడు కూడా..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలలో చైతన్యం కల్పించారలనే బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ చేసిన మోసాలకు ఏపీ ప్రజలు వారిని మూలనపడేశారన్నారు. ఎంతసేపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని రాయసీమ, ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని మండిపడ్డారు.
* దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా
దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, భాజపా మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని విమర్శించారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారని కన్నా వివరించారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలు పెంచి… ప్రజల రక్తం పీల్చేలా వైకాపా పాలన కొనసాగుతోందని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.
*రాజధాని రైతుల శిరిడీ పయనం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 57వ రోజుకు చేరాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై రోజుకో రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా రాజధాని రైతులు, మహిళలు బుధవారం శిరిడీ బయల్దేరి వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 200 మంది ‘జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.. అమరావతిని రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తూ శిరిడీ సాయి దర్శానికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
*16న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
దేశ రాజధానిలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఫిబ్రవరి 16(ఆదివారం)న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్ నేడు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ నేడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీ.. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోరనుంది. నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకారానికి ముందు కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
*ఆ అధికారం ఎవరికీ లేదు: యనమల
శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్ కమిటీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించే అధికారం ..అధికారులతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘనతోపాటు రాజ్యాంగ వ్యతిరేక విధానాల కిందకు వస్తుందన్నారు. సభా వ్యవహారాలకు విరుద్ధంగా వెళ్లే అధికారం ఏ అధికారికీ లేదని యనమల అన్నారు. అలా వ్యవహరించే వారు సభ తీసుకునే నిర్ణయాలకు బాధ్యులేనని యనమల పేర్కొన్నారు.
*రాత్రికిరాత్రే మారిన రాజకీయం… కేంద్ర మంత్రివర్గంలోకి వైకాపా?!
రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్లోకి ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటుదక్కబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి గట్టి లాబీయింగ్‌తో ముఖ్యమంత్రి – ప్రధానమంత్రి మధ్య బుధవారం జరగబోతున్న రెండు గంటల పాటు కీలక సమావేశం జరుగనుంది. ఇందులో కేంద్ర క్యాబినెట్లోకి వైకాపా చేరటానికి జగన్ మోహన్ రెడ్డి తన అంగీకారం తెలియచేయబోతున్నట్టు సమాచారం. విజయసాయి రెడ్డి సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలోనూ, అలాగే బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్లో చేరబోతున్నట్టు సమాచారం.అసలిక ఎలాంటి పరిస్థితుల్లోనూ, వైకాపాకి బీజెపికి మధ్య సయోధ్య కుదరకపోవచ్చుననీ, ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టు కట్టిన జనసేనను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మరోసారి వ్యూహాత్మక రాజకీయం నడపవచ్చుననీ భావించిన తెలుగు దేశానికి, ఈ తాజా పరిణామం కొంచెం మింగుడు పడని అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి లోగడ రెండు సందర్భాల్లోనూ.. ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ, అమిత్ షాతోనూ అపాయింట్మెంట్ దొరకక వెనుదిరిగిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత అపాయింట్మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోపు, బీజేపీ రాజ్య సభ్యుడు సుజనా చౌదరికి, అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాసిన లేఖల పర్యవసానంగా బీజేపీకి, వైకాపాకు మధ్య సయోధ్య చెడిందనే అందరూ భావించారు.ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకావటం, విజయసాయి రెడ్డి గట్టిగా లాబీయింగ్ చేయటంతో మొత్తానికి… ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకోనుంది. కీలకమైన బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలంటే, బీజేపీకి అనివార్యంగా ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం. దానికితోడు, మార్చిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు కాబట్టి, అది రాజ్యసభలో ‘ఆపత్కాలం’లో బీజీపీకి అనుకూలించే అంశం. అందుకే వైకాపాను దగ్గరకు చేరదీసినట్టు సమాచారం.
*భాజపా బహిరంగ సభలు 6,500
దేశ రాజధాని దిల్లీలో అధికారాన్ని దక్కించుకునేందుకు భాజపా సర్వశక్తులూ ఒడ్డింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు 70 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 6500 బహిరంగసభలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు విస్తృతంగా ప్రచారం చేశారు. వీరిద్దరూ కలిసి 68 బహిరంగసభల్లో పాల్గొన్నారు. 24 రోడ్‌షోలు నిర్వహించారు. జేపీ నడ్డా మొత్తం 70 నియోజకవర్గాల్లోనూ పర్యటించారు. అమిత్‌షా కూడా దాదాపు 60 నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ఈ ప్రచారానికి మరింత ఊపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ రెండు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. భాజపాకు చెందిన ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ (యూపీ), విజయ్రుపాణి(గుజరాత్), జైరామ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్) బీరెన్ సింగ్ (మణిపుర్), త్రివేంద్ర సింగ్‌రావత్ (ఉత్తరాఖండ్), శర్వానంద్ సోనోవాల్(అసోం), నీతీశ్‌కుమార్ (బిహార్)లు ప్రచారం చేశారు. వీరుగాక మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, శివరాజ్‌సింగ్ చౌహాన్లు కూడా అభ్యర్థుల విజయం కోసం శ్రమించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ 26, రాజ్‌నాథ్‌సింగ్ 12, నితిన్ గడ్కరీ 10 సభల్లోనూ పాల్గొన్నారు.
*16 మంది కొత్త ‘ఆద్మీ’లు!
ఈ దఫా దిల్లీ శాసన సభ ఎన్నికల్లో 16 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరంతా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వారే కావడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమిపాలైన ఆతిషీ, రాఘవ్ చద్దా, దిలీప్ పాండే కూడా వీరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ క్రికెటర్, భాజపా అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమిపాలైన ఆతిషీ ఈ దఫా కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి 11,393 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజీందర్ నగర్ స్థానం నుంచి చద్దా 20,058 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. 24వేల ఓట్ల మెజార్టీతో తిమార్పుర్ అసెంబ్లీ స్థానాన్ని పాండే దక్కించుకున్నారు.
*థర్డ్జెండర్కూ ప్రాతినిధ్యం దక్కాలి: రేవంత్‌రెడ్డి
ఏడు దశాబ్దాలుగా దేశంలో థర్డ్‌జెండర్‌కు రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చట్టసభల్లోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఈ అంశాన్ని ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆంగ్లో ఇండియన్ స్థానంలో థర్డ్ జెండర్‌కు నామినేటెడ్ పదవి కల్పించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి డిమాండు చేశారు
*ప్రజా సమస్యలపై ఉద్యమాలు
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, ప్రజా చైతన్య సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని తెలంగాణ జనసమితి(తెజస) రాష్ట్రాధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన తెజస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బుతో ఓట్లను కొల్లగొట్టిందని, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని, పంటకు గిట్టుబాటు ధరలు అందజేయాలని వరంగల్, ఖమ్మం మార్కెట్ యార్డుల్లో ఆందోళనలు చేపట్టాలని తీర్మానించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో రుసుముల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కార్యవర్గం తీర్మానించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచాలనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
*కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వీహెచ్
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, రిజర్వేషన్ల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేయడానికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని వీహెచ్ ఆరోపించారు.
*హక్కులను కాలరాసేందుకు కేంద్రం కుట్ర: సంపత్‌కుమార్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఎ.సంపత్‌కుమార్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు చెల్లుతుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్‌లో సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాల ఛైర్మన్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బలహీన వర్గాలను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ తరఫున ఈ నెల 16న లేదా 17న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడతామని సంపత్‌కుమార్ తెలిపారు.
*తెతెదేపా మహిళా కార్యవర్గం నియామకం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ కార్యవర్గంలో మొత్తం 48 మందిని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నియమించినట్లు పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా టి.జ్యోత్స్న, మరో ఐదుగురిని ఉపాధ్యక్షులుగా, 11 మందిని కార్యదర్శులుగా, 15 మందిని ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా, 9 మందిని అధికార ప్రతినిధులుగా, ఏడుగురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
*దిల్లీ భాజపా కార్యాలయం ఎదుట వెలిసిన పోస్టర్
శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో తమ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తున్నట్లు తేలిపోయిన వెంటనే ‘భాజపా గెలుపుతో పొంగిపోదు. ఓటమికి కుంగిపోదు’ అనే ప్రకటనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫొటోతో కూడిన బ్యానర్ దిల్లీ భాజపా కార్యాలయం ఎదుట కట్టారు. అమిత్‌షా ఆధ్వర్యంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రచారం చేసిన భాజపాకు ఘోర ఓటమి తప్పలేదు. తమ పార్టీ గెలిచిన స్థానాలు రెండంకెలకు సైతం చేరని నేపథ్యంలో కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అరుదైన బ్యానర్ కట్టడం గమనార్హం.
*తెదేపా నేతలకు భద్రత కుదింపు
రాష్ట్రవ్యాప్తంగా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు భద్రతను తగ్గించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కిడారి శ్రవణ్‌కుమార్‌ల గన్మెన్లను పూర్తిగా తొలగించారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడుకి 2+2 భద్రత ఉండగా..దాన్ని 1+1కు కుదించారని పేర్కొన్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తూటా రక్షక కవచ వాహనాన్ని తొలగించగా..రంపపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి గన్‌మెన్‌ను తొలగించారని వివరించాయి. మరోవైపు భద్రతా సమీక్ష కమిటీ సూచనల మేరకు అంగరక్షకులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించకున్నా.. పై అధికారుల ఆదేశాలను అమలుచేస్తామని పేర్కొన్నారు. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి గతంలో 2+2 గన్‌మెన్ భద్రత ఉండేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1+1కు కుదించారు.
*కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వీహెచ్
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, రిజర్వేషన్ల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేయడానికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని వీహెచ్ ఆరోపించారు.
మార్చి 15 లోపు పంచాయతి ఎన్నికలు-రాజకీయ
Related tags :