ఉల్లిపాయలు.. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల సమస్యలకు ఉల్లిని మించిన పరిష్కారం లేదనే చెప్పొచ్చు. అందుకే ఊరికే అన్నారా.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని.. పిల్లల్ని పెంచడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయి. ఇక వారిని నిద్రపుచ్చాలంటే అంత వీజీగా అయ్యే పని కాదు.. చాలా తపనపడాలి. కానీ, కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తే చాలు వారిని ఈజీగా నిద్రపుచ్చొచ్చు. ఇందుకోసం ఉల్లిని వాడొచ్చు. వీటితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉల్లి పరిష్కారం చూపుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
*ఉల్లిపాయతో పిల్లల్ని నిద్రపుచ్చొచ్చు..
చిన్నపిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు. వారికి ఎన్ని కథలు చెప్పినా.. మరెన్ని విషయాలు చెప్పినా అంత త్వరగా పడుకోరు. అలాంటి చిచ్చరపిడుగుల కోసం ఓ మంచి చిట్కా.. అదేంటంటే.. ఉల్లి పాయ పొట్టు తీసి దాన్ని నీటిలో వేసి వేడి చేయండి.. ఈ నీటిని తీసుకుని ఆ నీటికి రెండు చెంచాల చక్కెర కలిపి పిల్లలకి తాగించండి. దీని వల్ల పిల్ల ఆదమరిచి నిద్రపోతారు. అయితే, ఇది ఎక్కవసార్లు చేయకపోవడం మంచిది.. ఎందుకంటే ఇది అలవాటైతే మామూలుగా పడుకోలేరు. కాబట్టి పిల్లలు బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ చిట్కాని ట్రై చేయొచ్చు.
*చెవినొప్పికి కూడా పరిష్కారం..
దీంతో పాటు చిన్నారులు అనేక కారణాల వల్ల చెవినొప్పి అంటూ బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఉల్లి రసాన్ని వేడి చేసి చల్లారనివ్వాలి. అది బాగా చల్లారిన తర్వాత చెవిలో పోస్తే నొప్పి తగ్గుతుంది.. అయితే రెండు చుక్కలు వేస్తే చాలు.. ఎక్కువగా వేయకూడదు. దీని వల్ల చెవిలోని ఎలాంటి సూక్ష్మజీవులు, క్రిములు అయినా సరే చచ్చిపోయి.. ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం తగ్గుతుంది. ఇలా చేస్తుంటే చెవి నొప్పి తగ్గుతుంది.
*అజీర్తికి కూడా మందుగా..
చాలా మంది అజీర్తి సమస్యలతో బాదపడుతుంటారు. దీంతో పాబటు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సార్లు ఎన్ని మందులు తీసుకున్నా సమస్య తగ్గదు. అలాంటి వారు ఈ చిట్కాని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే గోరు వెచ్చని నీటికి అరకప్పు ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఇలా తయారైన డ్రింక్‌ని తాగితే చాలు విరేచనాలు, వాంతులు తగ్గుతాయి.
*ముక్కు నుంచి రక్తం కారుతుంటే..
చాలా మందికి వేడి చేసి ముక్కునుంచి రక్తం కారుతుంటుంది. అలాంటి వారు ఉల్లిపాయని ఉపయోగించి సమస్యని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఉల్లిపాయను కట్ చేసి వాసన చూస్తుండాలి. ఇలా చేస్తుంటే చాలా వరకూ ఉపశమనం ఉంటుంది. రక్తం కారడం వెంటనే తగ్గుతుంది.
*పళ్లు పుచ్చిపోయిన కూడా తగ్గుతుంది..
కొంతమందికి పళ్లు పుచ్చిపోయి నొప్పిగా ఉంటుంది. అలాంటి వారు కూడా ఉల్లిని ఉపయోగించి సమస్యని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం వంటనూనె, ఉల్లిపాయ రసాన్ని సమాన పరిమాణాల్లో కలపాలి. దీనిని పుచ్చిపళ్లు ఉన్న దగ్గర అద్దుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే నొప్పి, సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ఇలా బ్యాక్టీరియాతో బాధపడే ఏ సమస్యలు అయినా ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుంది.
ముక్కు నుండి రక్తం కారుతుంటే…
Related tags :