ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో వైకాప ఎమెల్యే రోజా భర్త సమరానికి దిగారు. రోజా భర్తకు రజనీకాంత్ కు లింకేంతన్న అనుమానం కలిగినా ఇది నిజం. రజనీకాంత్ వైఖరిపై మండిపడుతున్నారు రోజా భర్త. సూపర్ స్టార్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రజనీకాంత్ బహిరంగ విమర్శలకు దిగుతున్న రోజా భర్త ఇప్పుడు కోలీవుడ్ లో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. రోజాభర్త తమిళ సిని దర్శకుడు సెల్వమణి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత కొంత కాలంగా సేల్వమానికి సినిమాలు పెద్దగా లేవు. దాంతో రాజకీయాల్లో రోజాకు చేదోడుగా ఉంటూనే తమిళ దర్శకుల సంఘానికి సారధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు దర్శకత్వం నేర్పిన సేల్వమానికి ఇప్పటికీ సినిమా పరంగా ఫాలోయింగ్ బాగానే ఉంది. కాని ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తమిళ సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారాయి. తమిళ నాట ఇప్పుడు అసలు సినిమాలు ఆడకపోవదానికి ఎవరు అనే అంశంపై చర్చ మొదలైంది. సినిమాకు హైప్ వచ్చేలా చేసే హీరోలా? లేక అంచనాలకు అనుగుణంగా సినిమాను తీయలేకపోయిన దర్శకులా? ఈ చర్చకు తెరలేపింది. సెల్వమణి వ్యాఖ్యలే. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ డైరెక్టర్ లో వచ్చిన సినిమా దర్బార్. ఈసినిమాపై తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది.
రజనీకాంత్‌తో ఢీకొడతానంటున్న రోజా భర్త
Related tags :