అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ కొత్త ఇల్లు కొన్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న వార్నర్ ఎస్టేట్‌ను బేజోస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మీడియా మొగల్ డేవిడ్ గిఫెన్ వద్ద ఉన్న ఆ ఎస్టేట్‌ను సుమారు 1200(165 మిలియన్ల డాలర్లు) కోట్లకు కొన్నట్లు ఓ పత్రిక కథనం రాసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఇది రికార్డు ధర అని ఆ కథనం పేర్కొన్నది. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉన్న బెల్ ఎయిర్ ఎస్టేట్‌ను మీడియా మొగల్ ముర్దోక్ 150 మిలియన్ల డాలర్లు పెట్టి ఖరీదు చేశాడు. అయితే అమెజాన్ చీఫ్ కొన్న ఇంటి గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకురాలేదు. సుమారు 10 ఎకరాలు ఉండే వార్నర్ ఎస్టేట్‌ను 1990లో గిఫెన్ ఖరీదు చేశాడు. 1937లో జాక్ వార్నర్ ఆ ఎస్టేట్‌ను నిర్మించారు. జెఫ్ బేజోస్ తన గర్ల్‌ఫ్రెండ్ లారెస్ సాంచేజ్ గురించి కొత్త ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ ఎస్టేట్‌ను ఖరీదు చేసినట్లు భావిస్తున్నారు.
షేర్లు అమ్మేసి…ఇల్లు కొనుక్కుని…
Related tags :