గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శాస్త్రవేత్తలు, ఆచార్యులకు గొప్ప అదృష్టం వరించిందని కొనియాడారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ గురువారం సందర్శించారు. తొలిసారిగా సందర్శనకు విచ్చేసిన గవర్నర్‌కు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఇతర శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ముందుగా వర్సిటీ ప్రాంగణంలోని ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విశ్వవిద్యాలయం పరిధిలోని పలు పరిశోధన కేంద్రాలను పరిశీలించారు.
శాస్త్రవేత్తలు రైతులకు సేవ చేయాలి
Related tags :