తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి సిఫార్సు లేఖలు అవసరం లేకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించింది. చిన్న లడ్డూతో పాటు కల్యాణోత్సవ లడ్డూను విక్రయిస్తున్నారు. దీని ధరను రూ.200గా నిర్ణయించారు. అందరికీ పెద్ద లడ్డూలను అందిస్తుండటంతో సాధారణ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యులకు కూడా కళ్యాణం లడ్డూ
Related tags :