ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగబోయే మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ సేన 1983లా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని కోచ్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డారు. ఈసారి టోర్నీ ఫేవరెట్ జట్లలో భారత్ కూడా ఒకటని తెలిపారు. 2017 వన్డే ప్రపంచకప్‌లో, 2018 టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీమ్‌ఇండియా మహిళలు అన్ని విభాగాల్లో మెరుగయ్యారని, బ్యాటింగ్ విధానంలోనూ మార్పులొచ్చాయని రామన్ చెప్పారు. ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు టైటిల్ సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకోసం అందరూ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ ఈ జట్టు విశ్వవిజేతగా నిలిస్తే.. 1983లో కపిల్ దేవ్ జట్టులా చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌లో సూపర్ స్టార్లు అవుతారని రామన్ చెప్పినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. ఈ మెగా టోర్నీకి ముందు హర్మప్రీత్ సేన.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. కాగా, ప్రపంచకప్ ప్రారంభమానికి ముందు పాకిస్థాన్‌తో 16న, వెస్టిండీస్‌తో 18న రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.
మహిళా సేన టైటిల్ కొడుతుందా?
Related tags :