‘రక్త చరిత్ర’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాధిక ఆప్టే లండన్‌కు చెందిన గాయకుడు బెనెడిక్ట్ టైలర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం డాన్స్ నేర్చుకోవడానికి లండన్‌లోని ట్రినిటీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీకి వెళ్లింది రాధిక. అక్కడే సంగీతం విద్యార్థి అయిన బెనెడిక్ట్ తొలిచూపులోనే రాధికకు లైక్ కొట్టి ఆమెని ప్రేమలో పడేశాడు. కొంతకాలం ఇద్దరూ డేటింగ్ చేశాక ఆరేళ్ల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. లండన్‌లో కాపురం పెట్టిన రాధిక ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.
సంగీతం ప్రేమ
Related tags :