Politics

గిర్రున వెనక్కి తిరిగి వచ్చిన సెలెక్ట్ కమిటీ దస్త్రం

Select Committee Document Rejected By MLC Secretary

సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుపై ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరీఫ్‌ మండలి కార్యదర్శికి ఇటీవల దస్త్రాన్ని పంపగా.. అది నిబంధనలకు విరుద్ధమంటూ మండలి కార్యదర్శి దాన్ని తిప్పి పంపారు. మండలి ఛైర్మన్‌ మళ్లీ దాన్ని కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి కూడా ఆయన తిప్పి పంపారు. నిబంధనల ప్రకారం సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ ఛైర్మన్‌కు పంపిన నోట్‌లో మండలి కార్యదర్శి తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు గడువులోగా సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు కానందున బిల్లులు ఆమోదం పొందినట్లేనని, ఇక రావాల్సింది గవర్నర్‌ ఆమోదమేనని మంత్రులు, అధికారపార్టీ నేతలు పేర్కొంటున్నారు.