DailyDose

హార్దిక్ పటేల్‌ను ఏమి చేశారు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Hardik Patel Gone Missing For 3 Weeks

* పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని  ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు. ఇలా ఎంతకాలం ఆయన్ను మా నుంచి వేరు చేస్తారు. 2017లో పాటీదారులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం హార్దిక్‌ పటేల్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ప్రస్తావించకుండా హార్దిక్‌ను ప్రభుత్వం అడ్డుకుంటోంది’’ అని వీడియోలో ఆమె ఆరోపించారు.

* తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు నిషేధం కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ సోకడంతో వేలాదిగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా మాంసం ఉత్పత్తుల అమ్మకాలపై మున్సిపల్ అధికారులు నిషేధం విధించారు. వైరస్ సోకిన కోళ్లను కాల్చి వేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు సూచించారు. 

* పాలుపోసేవాడితో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త..ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.భార్య తనని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాలు పోసే వ్యక్తితో ఆమె ప్రేమాయణం రోజు రోజుకీ కొనసాగిస్తోంది. తొలుత అతను నమ్మలేదు. చాలాసార్లు చూసిన తర్వతా అతనిలో అనుమానం మొదలైంది. ఆ అనుమానం అతనిలోని రాక్షసుడిని నిద్రలేపింది. దీంతో… భార్యతో చనువుగా ఉంటున్న ఆమె ప్రియుడిని అతి దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన నల్గొండ జిల్లా అనుముల లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల వ్యాపారం చేసే రేవంత్‌కుమార్‌ ప్రతి రోజు హజారిగూడెం వెళ్లేవాడు. అక్కడ పలు ఇళ్లల్లో పాలు పోసేవాడు. అయితే… రేవంత్ కుమార్.. పాలు పోయడానికి వచ్చి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జానపాటి హరికృష్ణ భావించాడు. ఈ విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.రేవంత్‌కుమార్‌ను చంపేందుకు మూడు సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ నెల ఐదో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు హరికృష్ణ, రాజేష్‌, మహేష్‌, రామాంజనేయులు కలిసి హజారిగూడెం స్టేజీ సమీపంలో చెట్ల పొదల్లో మాటు వేశారు. అదే సమయంలో పాల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రేవంత్‌కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేసి రాడ్లతో కొట్టి, కొడవళ్లతో ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో హరికృష్ణ సుపారీ ఇచ్చి మరీ హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేశామని అంగీకరించారు

* పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ జవానును పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తిరుమల్ రెడ్డి తన వద్ద తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2002 నుంచి 2019 వరకు ఆర్మీలో పనిచేసి రిటైరైన బద్దం తిరుమల్ రెడ్డి డీబిబిఎల్ అనే లైసెన్స్డ్ వెపన్, 20 బుల్లెట్లను కలిగి వున్నాడు. 2019 డిసెంబర్ 31 రాత్రి శాయంపేట లో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఓపెన్ ఫైరింగ్ పాల్పడ్డాడు. గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను గ్రామస్తులు తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. తాజాగా ఈనెల 13న గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరగగా ఆ సమయంలో కూడా తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియోలు, పాత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసిపి హాబీబ్ ఖాన్, సీఐ  ప్రదీప్ కుమార్, ఎస్సై ప్రేమ్ కుమార్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి నుంచి డీబీబీఎల్ వెపన్, 10 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

* నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వీరు గత కొంతకాలంగా ఒంగోలులోని రైలు పేటలో నివాసం ఉంటున్నారు. నిన్న ఒంగోలు నుంచి కారులో ఇదే కుటుంబానికి చెందిన ఆరుగురు చెన్నై వెళ్లారు. యశ్వంత్ తల్లితండ్రులను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించి తిరిగి బయల్దేరారు. శుక్రవారం ఉదయం తడ మండలం పన్నంగాడు వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి (37)  అనుసెల్వీ (27)  చిన్నారి రియాన్ (ఏడాది) అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. యశ్వంత్ (35) ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

* టెలికాం సంస్థలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదంటూ కడిగి పారేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. సంస్థల నుంచి బకాయిలను రాబట్టడంలో విఫలైమన ప్రభుత్వంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీల కింద టెలికాం సంస్థలు ప్రభుత్వానికి రూ.92,000 కోట్లు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలికమ్యూనికేషన్స్‌ సహా మిగిలిన టెలికాం సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.

* నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

* అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వేళ్లుమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీను అలియాస్‌ మంగళ శ్రీను అనే వ్యక్తి ఏడోతరగతి వరకు చదువుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా జేఆర్‌పురం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న పాత ఎస్‌.ఐ.అశోక్‌బాబుకు నెల రోజుల కిందట రాచపల్లి శ్రీను ఫోన్‌ చేసి తాను విశాఖపట్నం డీఐజీ మాట్లాడుతున్నాని నమ్మబలికాడు. మీరు వీఆర్‌లో ఉన్నారని తెలిసింది…మీ సమస్యను పరిష్కరిస్తానన్నాడు. ఇందుకు రూ.4 లక్షలు నాలుగు విడతులుగా ఇవ్వాలని సూచించాడు. పండ్లు అమ్ముకున్న వ్యక్తులకు చెందిన బ్యాంకు ఖాతాలు సేకరించి పోలీసు అధికారులకు ఇచ్చాడు. 2006 నుంచి బంగారు గొలుసుల చోరీల కేసుల్లో 18 ఎన్‌బీడబ్ల్యూ కేసులున్నాయి. కర్నాటక, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కేసులున్నాయి. 2016లో జైలు నుంచి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడుతున్నాడు. 2017లో బంగారు గొలుసు చోరీ చేస్తుండగా పట్టుబడి జైలుకెళ్లాడు.