రెండేళ్ళకిందట రష్యాకి చెందిన వ్యాపారవేత్త, క్రీడాకారుడైన ఆండ్రూ కొచీవ్‌ని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది నటి శ్రియ శరణ్. ప్రస్తుతం బార్సిలోనాలో కాపురం పెట్టిన ఈ అమ్మడు ఒకసారి మాల్దీవుస్‌కు విహారయాత్రకు వెళ్లింది. అక్కడ డీప్ సీ డైవింగ్ చేస్తున్నప్పుడు కలిశాడు ఆండ్రూ… అక్కడ మొదలైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారడం, కొంత కాలం డేటింగ్ చేయడం, పెళ్లి పీటలెక్కడం… అంతా చకచకా జరిగిపోయాయి. మనసుపడి మనువాడిన ఆండ్రూ వ్యాపారబాధ్యతల్లో ఇప్పుడు శ్రియ కూడా పాలుపంచుకుంటోంది.
సముద్ర ప్రణయం
Related tags :