ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీ యువకులు ఉంటారా? ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దగ్గరలో రాబోతున్నది. ప్రేమికుల రోజును ఒక వేడుకల జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోతారు. ఇక ఆ రోజు ఏ ప్రదేశాలకు వెళ్లాలి? ఎక్కడ గడపాలి? అని ప్లాన్లు వేసుకునే ప్రేమ పక్షులు ఎన్నో.. మనసుపడ్డ వారికి మదిలోని ప్రేమను ఎక్కడ? ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి జంటల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు పరచుకున్న ఆ ప్రదేశాలు ప్రేమికులను అద్భుత లోకాల్లో విహరించేలా చేస్తాయి. అలాంటి ప్రదేశాల్లో మన హైదరాబాద్ కూడా ఒకటి. మరి హైదరాబాద్‌లో అలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..
**హైదరాబాద్ అందమైన సిటీ మాత్రమే కాదు చారిత్రక కట్టడాలు, రొమాంటిక్ వాతావరణం కలిగిన ప్రదేశం. వాలెంటైన్స్ డే రోజును ప్రేమ జంటలు తిరగడానికి అనేక రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ డేటింగ్‌తో మీ ప్రియుడు/ప్రేయసిని ఆశ్చర్యపరచవచ్చు. ప్రేమికులు మనస్సును ఆహ్లాదపరిచేవిధంగా హైదరాబాద్‌లో వాటర్ ఫాంట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఫర్‌ఫెక్ట్ రొమాంటిక్ సెట్టింగ్‌ను కలిగి ఉన్నాయి. నెక్లెస్ రోడ్ నుండి హుస్సేన్ సాగర్ లేక్, దుర్గం చెరువు, ఫలక్‌నామా ప్యాలెస్ వరకు అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమలో ఉన్నవారి మధ్య బంధం మరింత బలపడటానికి అనువైన ప్రదేశాలు. మరి వీటితో పాటు మరికొన్ని రొమాంటిక్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
*ఫలక్‌నామా ప్యాలెస్
19వ శతాబ్దకాలం నాటి ఒక అద్భుతమైన కట్టడం ఫలక్‌నామా ప్యాలెస్. రాజసాన్ని ఉట్టిపడేలా చేసే ఈ ప్రదేశం ప్రేమజంటలకు చాలా అద్భుతమైన
ప్రదేశం. ఇక్కడ రెస్టారెంట్లో డిన్నర్ చేసి, కొంత సమయాన్ని గడపవచ్చు. కాబట్టి.. మీ పార్టనర్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
*హుస్సేన్‌సాగర్ లేక్
ఇది మానవ నిర్మిత సరస్సే అయినప్పటికీ హుస్సేన్ సాగర్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాయం సంధ్యలో ప్రకృతి.. ప్రేమ పక్షులు.. ఎంతో బాగుంటాయి. ఇందులో నీటికి సంబంధించిన ఆటలు కూడా ఉన్నాయి. ఇక్కడికి మీ పార్టనర్‌ను తీసుకెళ్ళడానికి అనువైన ప్రదేశం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇది ప్రేమికులను ఆహ్వానిస్తుంది. సంధ్యాసమయంలో ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్‌తో పాటు దగ్గరలోని లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, ఈట్‌స్ట్రీట్ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.
*గోల్కొండ
ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం గోల్కొండ కోట. ఫిబ్రవరి 14న మీ పార్ట్‌నర్‌తో డేటింగ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశం గోల్కొండ కోట. మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి ఒక ఉత్తమ ప్రదేశం గోల్కొండ. ఇతర ప్రేమ జంటలు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్లు, రొమాంటిక్ ప్రదేశాల్లో రద్దీగా ఉన్నప్పుడు మీరు ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకున్నప్పుడు గోల్కొండ కోట రొమాంటిక్ ప్రదేశం.
*కేబీఆర్ పార్క్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతున్న పార్క్ ఇది. ప్రేమజంటలు చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగేవారు, ఇప్పటికే మునిగినవారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.
*గుఫా
థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఇది. పార్ట్‌నర్‌కు ఒక సరికొత్త నార్త్ ఇండియన్ వంటకాలను రుచి చూపించడానికి ఒక సరైన ప్రదేశం ఇది. ఒక గుహలోపల క్యాండిల్ లైట్ డిన్నర్‌కు చాలా మంచి ప్రదేశం. ప్రేమికుల రోజున ఇక్కడ భోజనం మరింత ఉత్సాహాన్నిస్తుంది.
*అనంతగిరి హిల్స్
నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్.. రొమాంటిక్ డెస్టినేషన్‌గా ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కొండల నుండి జాలువారే జలాలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో అనంతగిరి హిల్స్ ప్రకృతి ప్రేమికులను మైమరిచిపోయేలా చేస్తుంది. నగరం నుండి సుమారు ఒక గంట ప్రయాణం చేస్తే అనంతగిరి కొండలను చేరుకోవచ్చు. ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన హిల్ స్టేషన్ ఇది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి దృశ్యం మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేర్చే శృంగార ప్రదేశం.
*షామీర్‌పేట్ లేక్
ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిలరాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.
*సీక్రెట్ లేక్
ఒకప్పుడు సీక్రెట్ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజ సిద్ధమైన చెరువు ప్రేమికులకు మాత్రమే.. ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ చెరువు లోయలో, కొండల మధ్య అత్యంత సుందరంగా ఉండేది, అయితే ఈ ప్రదేశం ఎక్కువమందికి తెలియకపోవడం చాలా కొద్దిమంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్ లేదా రహస్య చెరువు అని మారుపేరు ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.
*తారామతి-బారాదరి
చరిత్రలోకి తొంగిచూస్తూ మధుర స్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి-బారాదరి కూడా పర్‌ఫెక్ట్ వాలెంటైన్ డే ప్లేస్ అని చెప్పవచ్చు. సుఫీ అండ్ గజల్స్, ఖవ్వాలీ సింగర్స్‌తో ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. ఒకప్పుడు భగ్మతి అనే ప్రముఖ నృత్యకారుడు ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా థియేటర్‌గా మారింది. ఇది ఇప్పుడు గజల్స్ మరియు డాన్స్ నైట్స్ నిర్వహించబడుతోంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రదేశానికి వెళ్లడం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది.
**ఫిబ్రవరి.. ప్రేమ జంటలకు చాలా ముఖ్యమైన మాసం. పర్యటనలకు ఈ నెలలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ ప్రేమికుల రోజును జరుపుకునేందుకు ఒక మంచి ట్రిప్‌ను ప్లాన్ చేయడం ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. సరికొత్తగా ప్రపోజ్ చేయవచ్చు. ఈ క్షణాలను మరపురాని జ్ఞాపకాలుగా మలచుకోవాలంటే ఈ రొమాంటిక్ గైడ్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. *
*వాలెంటైన్స్ వీక్
ప్రేయసి/ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు వాలెంటైన్స్ డేనే సరైన సమయమని భావిస్తుంటారు. ఇందుకు వారికి తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను చెబుతుంటారు. ఇలా చెప్పడానే్న ప్రపోజ్ చేయడమంటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపోజ్ డే..గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేతో పాటు వాలెంటైన్స్ వీక్ కూడా ఉందని మీకు తెలుసా.. వారం రోజుల ముందుగానే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7న రోజ్ డే మొదలుకొని ప్రపోజ్ డే వరకు చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. చివరగా వాలెంటైన్స్ డే.. ఇలా వారం రోజుల పాటు ప్రేమ పండుగను ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 7న రోజా పువ్వు ఇవ్వడంతో మొదలుపెట్టి లవ్ కొటేషన్ ఉన్న మంచి గ్రీటింగ్ కార్డో.., ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువో.. ఇస్తూ ఐ లవ్ యూ చెప్పవచ్చు. ప్రేమ తెలుపకపోతే అవతలివారికి మీపై ఫీలింగ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మీకు వారంటే ఇష్టం లేదని వారు అడ్వాన్స్ అవ్వకపోయే అవకాశం లేకపోలేదు. పెన్ను కదపడం కాస్త అలవాటుంటే చాలు.. సొంతంగా ప్రేమను తెలుపుతూ ప్రేమలేఖ రాయటం ఉత్తమం. సంగీతవాద్యాలపై పట్టు ఉంటే.. వాటిని ప్తే చేస్తూ మంచి సమయం చూసి ప్రేమ విషయాన్ని చెబితే ప్రయోజనం ఉంటుంది. అబ్బాయిలైతే.. ఒక ఎర్రటి రోజూ పువ్వుతో పాటు ప్రేమలేఖను ఇవ్వచ్చు.
################
ప్రేమికుల జంట జనారణ్యంలో కనుక కనిపిస్తే వారిని చుట్టుముడతామని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా వెల్లడించాయి. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం అనేది ‘విష సంస్కృతి’ అని వారికి అర్థమయ్యేలా చెప్తామని తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని పార్కులన్నీ బోసిపోయాయి. ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఎవరైనా పార్కుల వైపు చూస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ఇప్పటికే భజరంగ్ దళ్, వీహెచ్‌పీ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఎవరైనా జంటలు పార్కులవైపు వస్తే, వారిని అడ్డుకొని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాస్పద ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సహా అన్ని ప్రముఖ పార్కులను శుక్రవారం మూసేశారు. అంతేకాక, పార్కుల బయట పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రేమికుల జంట జనారణ్యంలో కనుక కనిపిస్తే వారిని చుట్టుముడతామని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా వెల్లడించాయి. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం అనేది ‘విష సంస్కృతి’ అని వారికి అర్థమయ్యేలా చెప్తామని తెలిపారు. ఇదే సమయంలో గతేడాది ఇదే రోజున సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన పుల్వామా ఉగ్రదాడిని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆ దాడిలో 40 మంది జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, అబిడ్స్, సికింద్రాబాద్, ఇందిరాపార్కు, మూసాపేట్, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాల్లో తమ సభ్యులంతా కలిసి వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తారని శుక్రవారం బజరంగ్ దళ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం అనేది విష విష సంస్కృతిని ప్రచారం చేయడమేనని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ అన్నారు. ఇది యువతను పాడుచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పాశ్చాత్య విధానాల వల్ల చక్కని భవిష్యత్తు ఉన్న యువత నాశనం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
################
ప్రేమికుల రోజు వచ్చేసింది. ప్రేమ పక్షులు మరో లోకంలో విహరించే రోజు రానే వచ్చింది. అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా వచ్చింది? ఫిబ్రవరి 14వ తేదీనే లవర్స్ డే గా ఎందుకు జరుపుకుంటారు?
ప్రేమ పక్షులకు ఫిబ్రవరి 14 పండుగ దినం. రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకునే ‘వాలెంటైన్స్ డే’ కు పెద్ద కథే ఉంది. మూడో శతాబ్ధంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్.. యువకులకు వివాహాలు కాకుండా అడ్డుకున్నారు. దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశారు. క్లాడియస్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణం. పురుషులు పెళ్లిళ్లు చేసుకుంటే ఆలోచించే శక్తి నశిస్తుందనేది ఆయన అపోహ. ఆ మేరకు రాజ్యంలో ఎవరూ వివాహాలు చేసుకోవద్దని ఆజ్ఞ జారీ చేశాడు.
చక్రవర్తి క్లాడియస్ ఆదేశాల మేరకు రోమ్ లో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవారు. ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టం తీసుకొచ్చినట్లు చెబుతారు. అయితే పూజారి (సెయింట్) అయిన వాలెంటైన్.. చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించేవాడు. వివాహామైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుంటాడు. ఆ మేరకు తాను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు. దీంతో చాలామంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు. దాంతో వాలైంటైన్ తనను ధిక్కారించారని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
వాలెంటైన్ వ్యవహార శైలిపై క్లాడియస్ కోపం పెంచుకున్నాడు. దాంతో వాలెంటైన్ ను జైల్లో బంధించాడు. క్రీ.శ. 269, ఫిబ్రవరి 14న వాలెంటైన్‌కు ఉరిశిక్ష విధించాలని ఆదేశించాడు. అయితే ఉరితీసే ముందురోజు సాయంత్రం.. తాను ప్రేమించిన జైలు అధికారి కుమార్తెకు తొలిసారిగా ఆయన ప్రేమ సందేశం పంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ అధికారి కుమార్తెతో వాలెంటైన్ స్నేహం చేశాడు. ఆమె అంధురాలు కావడంతో వాలెంటైన్ చూపు తెప్పించారట. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది. ఆ ప్రేమ సందేశంలో ‘ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని రాసి ఉందంటారు. అలా వాలెంటైన్‌ను ఉరి తీసిన ఫిబ్రవరి 14.. లవర్స్ డే గా ప్రాచుర్యం పొందింది.
################
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రేమగీతం…..
…
79. మోహన కల్యాణి:
మోహన కల్యాణి 65 వ మేళకర్త మేచ కల్యాణి జన్యం. ఆరోహణ మోహన స్వరాలూ, అవరోహణ లో కల్యాణి స్వరాలూ వస్తాయి. బిలహరికి ఈ రాగానికి మధ్యమమే తేడా. ఉపాంగ, వర్జ్య రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. రక్తి రాగం. రాగాలాపన, స్వరకల్పన వేయవచ్చు. తానం-పల్లవి పాడెంత పెద్దరాగం కాదు.
ఆరోహణ; స రి గ ప ద స …అవరోహణ: స ని ద ప మ గ రి స. చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాధం.
హిందుస్తానీ సంగీతం లో ఈ రాగాన్ని భూప్ కళ్యాణ్ అంటారు.
శాస్త్రీయ సంగీతం లో కొన్ని రచనలు:
సేవే శ్రేకాంతం-స్వాతి తిరునాళ్; భువనేశ్వరీయ, సిద్ధి వినాయకం -ముత్తయ్య భాగవతార్; తక తఝను ( తిల్లాన )-లాల్గుడి G. జయరామన్;
ఆదినయ కన్నె- ML. వసంత కుమారి.
…
తెలుగు చలన చిత్రాలలో మోహన కల్యాణి లో ఉన్న పాటలు:
మదిలోన మధుర భావం-జయసింహ; పులకించని మది -పెళ్లి కానుక; ఓయి సఖా-అనార్కలి (జానే వఫా-హిందీ అనార్కలి); తిరుమల గిరి వాసా-రహస్యం;
జోరు మీదున్నావు తుమ్మెదా-శివరంజని;
….
పులకించని మది – చిత్రం: పెళ్లి కానుక; రచన: ఆత్రేయ; సంగీతం: A. M. రాజ ; గానం: జిక్కి ; అభినయం: కృష్ణ కుమారి, anr; రాగం: మోహన కల్యాణి .
పాట సందర్భం: మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన అబ్బాయికైనా, అమ్మాయికైనా బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి, మరీ ముఖ్యంగా ఇంటి యజమాని త్వరగా చనిపోతే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెళ్లి కానుక సినిమా లో కూడా తండ్రి చిన్నప్పుడే చనిపోతే కుటుంబ బాధ్యత పెద్దమ్మాయి గీత మీద పడుతుంది. కుట్టుమిషన్ తో కుటుంబాన్ని, చెల్లెలుకు చదువు చెప్పిస్తుంది. అంతవరకూ కన్నేపిల్లల్లో సహజంగా ఉండే స్పందనలకు దూరంగా ఉన్నా, మేడ మీద కిరాయికి వచ్చిన భాస్కర్ ను మొదటి చూపులోనే ప్రేమిస్తుంది. (భాస్కర్, గీత చెల్లి వాసంతి అదివరకే ప్రేమించుకుంటున్నారు ).
ఒకసారి భాస్కర్ వానలో తడిసి జబ్బుపడితే, అతనికి పరిచర్యలు చేస్తూ, ఆతను పాడమంటే పాడే పాట ఇది.
1. సాహిత్యం: పూర్వం పాటల రచయిత సినిమా కథతో తాదాత్మ్యం చెంది పాట రాసేవారు. అందుకే ఆయా పాటల్లో నటీ నటుల హృదయం కనబడేది. ఈ పాటలో కూడా గీత మనస్సుకు అద్దం పట్టేలా రాశారు ఆత్రేయ గారు. పల్లవి రెండు చరణాల్లో గానం యొక్క గొప్పదనం, చివరి రెండు చరణాల్లో ప్రేమ యొక్క గొప్పదనం గొప్పగా చెప్పారు. కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు అంతేగాని ఎవరు బడితే వాళ్ళను కాదనీ, అలాంటి తోడు దొరికితే వారిమీద దోర వలపు ఆమె కురిపిస్తుంది, మదిని దోచుకొమ్మని అతనికి తెలుపుతుంది. ఎంత మంచి భావనలు ? ప్రతి కన్నెపిల్ల మనసులోని భావనలను హృద్యంగా రచించారు, అందుకే ఆయన మనసు కవి గా ప్రఖ్యాతి చెందారు.
2. సంగీతం: A. M. రాజాకు మొదటి సినిమా (తమిళ మాతృక) అయినా చాలా గొప్పగా వరసలు కట్టారు. ఈ పాటను మోహన కల్యాణి రాగం లో స్వరపరిచినా అక్కడక్కడ ప్రతిమధ్యమాన్ని వాడుకోకుండా, పాటకు కొత్త అందాల్ని తెచ్చారు. ఆరోహణ లోని మోహన స్వరాల లాగే ఆమె జీవితం లో అప్పటివరకు ప్రేమ, అనురాగం రెండూ లేవు. ఇకముందైనా అవరోహణ లోని కల్యాణి సంపూర్ణ స్వరాల వలే ఆమె జీవితం మంగళకరంగా ఉండాలని …..
ఈ రాగం ఎన్నుకున్నారా రాజా గారు అని అనిపిస్తుంది.
3 . గానం: ఆఖరుగా జిక్కి గారి గానం ఈ పాటకు ప్రాణం పోసింది. ఆమె గళం న భూతో న భవిష్యతి . ఇలాంటి పాటలను వింటుంటే మనం తెలుగు వారిగా పుట్టినందుకు గర్వించాల్సి వస్తుంది.
4. అభినయం: ఇక కృష్ణ కుమారి గారి నటన అత్యద్భుతంగా ఉంది, తమిళ మాత్రుకతో పోల్చి చూసుకుంటే ఆమె నటన గొప్పతనం తెలుస్తుంది.
భావాలన్నీ తన కళ్ళ తోటీ, ముఖ కవళికల తోటీ పలికిస్తుంది.
…
పల్లవి:
పులకించని మది పులకించు, వినిపించని కధ వినిపించు;
కనిపించని ఆశలనించు, మనసునే మరపించు;
గానం మనసునే మరపించు ||పులకించని||
చరణం: 1
రాగ మందనురాగ మొలికి , రక్తి నొసగును గానం,
రేపు రేపను తీపి కలలకు, రూపమిచ్చును గానం,
చెదిరి పోయే భావములను, చేర్చిగూర్చును గానం
జీవమొసగును గానం,… మది, చింతబాపును గానం ||పులకించని||
చరణం: 2
వాడిపోయిన పైరులైనా, నీరు గని నర్తించును
కూలిపోయిన తీగయైనా, కొమ్మనలమీ ప్రాకును
కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు,
దోరవలపే కురియు… మది దోచుకొమ్మని తెలుపు,
…………………ప్రేమ మనసునే మరిపించు.
################
ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో ఈ అందమైన కోట్స్, మెసేజ్‌లతో విష్ చేయండి.
ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ అందమైన కోట్స్‌తో విష్ చేయండి. మీ మనసులోని అందమైన భావాలకు వీటిని జత చేసి.. బోలెడంత ప్రేమ పొందండి.
నువ్వు లేని ఈ ఏకాంతంలో… నీ జ్ఞాపకాలే నాకు తోడయ్యాయి
జీవితం ఓ ప్రయాణం…
జీవనం ఓ ప్రమాణమని ఎవరో అన్నారు
నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి
నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి
నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది
యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం
పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు
పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ
ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను
నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను
మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ
జీవితమంతా… నీ ప్రేమలో కరిగిపోతాను
నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ…
నేను కన్న అందమైన కల నీ పరిచయం
వేకువై ఉదయించిన అస్తమించావు ఈ క్షణం
కన్నీళ్లై చేరువయ్యావే నా ప్రాణం
నన్ను నీ కళ్లలో పెట్టుకోకు…
కన్నీళ్లలో కొట్టుకుపోతాను…
హృదయంలో ఉంచుకో…
ప్రతి స్పందనకు గుర్తుంటాను
నీ ప్రేమ ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను
ప్రేమికుల రోజు వస్తుందని పొంగిపోనా
నీ ప్రేమ పొందలేదని కృంగిపోనా
మరుజన్మకైన నీ మనసులోని ప్రేమను నేనుకానమైన
నీ కన్నుల కాంతిలో ఉదయలు కనిపిస్తాయి
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి
నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి
నీ తలపుతోటి మనసుకు రెక్కలోస్తాయి
నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి
నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి
ఓటమినైనా ఓడదు ప్రేమ
చితిలోనైనా కాలదు ప్రేమ
మంటలోని మౌనం ప్రేమ
మరుజన్మకు ప్రాణం ప్రేమ
ఉదయించే సూర్యడు
ఈ ప్రపంచానికి వెలుగునిస్తే..
నీరాక నా జీవితంలోకి వెలుగు నింపింది
బంధం నువ్వే.. గ్రంధం నువ్వే
బాణం నువ్వే.. గాయం నువ్వే
గానం నువ్వే.. గేయం నువ్వే
వేదం నువ్వే.. ఆవేదన నువ్వే
సాయం నువ్వే.. ప్రాయం నువ్వే
దేహం నువ్వే.. ప్రాణం నువ్వే
ఆశ నువ్వే.. శ్వాస నువ్వే
ఆకాంక్ష నువ్వే.. నాకు అన్నీ నువ్వే
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
నువ్వు ప్రేమించే వాళ్లు
ఎంత మందైనా దొరుకుతారు
కానీ నిన్ను ప్రేమించే వాళ్లు
దొరకడం నీ అదృష్టం
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
నిన్ను చూడాలని తపించే
కనులకు ఎలా చెప్పను
నువ్వు నాలోనే ఉన్నావని
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
నీ మౌనం ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు