ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమాద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రవాల్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వీఐపీలుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పలువురు రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించడంపై విశేష ఆసక్తి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మెట్రో రైలు డ్రైవర్లు, స్కూల్ ఫ్యూన్లు సహా 50 మంది వీఐపీయేతర వ్యక్తులు ముఖ్యమంత్రితో పాటు వేదికను పంచుకోనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఇప్పటికే కేజ్రీవాల్ ఆహ్వానం పలికారు. ఇందులో భాగంగా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ సామాన్యుల పక్షాన 50 మందికి తన వేదికపై స్థానం కల్పించనున్నారు. ‘‘వివిధ వర్గాలకు చెందిన 50 మంది ప్రతినిధులు అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి వేదికను పంచుకుంటారు. ఢిల్లీ దశను నిర్ణయించే నిజమైన నిర్మాతలకు వీరు ప్రతినిధులుగా ఉంటారు. స్కూళ్లలోని ప్యూన్లు, మొహల్లా క్లినిక్స్‌లో పనిచేసే డాక్టర్లు, ఆటోరిక్షా, బస్సులు, అంబులెన్స్‌లు నడిపే డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, బస్సుల్లోని మార్షల్స్, టీచర్లు, హెడ్మాస్టర్లు సహా ఇతర వర్గాలకు చెందిన వారంతా ఇందులో్ ఉంటారు..’’ అని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులే కేజ్రీ VIPలు
Related tags :