దిల్లీ పర్యటనలో ఏం మాట్లాడారో కూడా చెప్పలేనిస్థితిలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ, అమిత్ షాతో ఏం మాట్లాడారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. దిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రంలో ఏముందో సీఎం జగన్ చెప్పాలన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మంత్రులతో ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. రైతులు రోడ్డున పడితే వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని దేవినేని నిలదీశారు. సుబాబుల్, మిర్చి రైతులను దోపిడీ చేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.
సీఎం…ఢిల్లీ గుట్టు విప్పాలి
Related tags :