శరీరంలో ఏదైనా రక్తనాళం దెబ్బతిని.. దాన్ని తొలగించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కృత్రిమ రక్తనాళాలను శరీరం ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా రోగి కొలేజన్తోనే రక్తనాళాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. మానవ కణాలను పరిశోధన శాలలో పెంచడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ పదార్థాన్ని ఉపయోగించుకుని ఈ రక్తనాళాలు సిద్ధమవుతాయి. పొరలు పొరలుగా లభించే ఈ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ పదార్థన్ని చిన్న చిన్న పోగుల్లా కత్తిరించడం, చేంతాడును పేనినట్లు ఈ పోగులతో రక్తనాళాలను పేనడం ఈ కొత్త పద్ధతిలోని ప్రక్రియ. ఇవి కుట్లు వేసినా పగిలిపోనంత దృఢంగా ఉంటాయని, ఒత్తిడికి పగిలిపోనూ పోవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణాలతోనే రక్తనాళాలను తయారు చేయడం వల్ల వీటిని రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరించే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈ కొత్త రకం రక్తనాళాలు కావాల్సిన ప్రమాణాలన్నీ కలిగి ఉన్నట్లు ఇప్పటికే రుజువు కాగా, త్వరలోనే ఈ రక్తనాళాలను జంతువులపై ప్రయోగించి చూడనున్నారు. ఆ తరువాత మానవుల్లోనూ ప్రయోగాలు చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తారు. పరిశోధన పూర్తి వివరాలు అక్ట్రా బయో మెటీరిలియా అనే జర్నల్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.
కృత్రిమ రక్తనాళాలు తయారీ
Related tags :