ముంబయిలో షూటింగ్ జరిగితే తన ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్తారట నటి రకుల్‌ప్రీత్ సింగ్. దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు రకుల్. మాంసాహారాన్ని ఎంతో ఇష్టపడే ఆమె గతకొంతకాలంగా శాకాహారిగా మారారు. ఇటీవల ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. శాకాహారిగా ఎందుకు మారానో వివరించారు. ‘నేను మాంసాహార ప్రియురాలిని. అలాగే శాకాహారం అంటే కూడా ఇష్టమే. కాకపోతే నా డైట్‌లో భాగంగా మాంసాహారం, ముఖ్యంగా కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని. అయితే అనుకోకుండా ఒకరోజు శాకాహారిగా మారాలనిపించింది. వెంటనే మారిపోయాను. శాకాహారిగా మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. శాకాహారిగా మారిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉన్నాననిపిస్తోంది’ అని రకుల్ తెలిపారు.
ఇంటి నుండే బాక్స్
Related tags :