* విటమిన్ సి మెండుగా ఉండే ఉసిరిని మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కురులకు బలం చేకూరుతుంది. ఇది జుట్టును చిన్నతనంలోనే నెరవకుండా అడ్డుకుంటుంది. దీనిలోని ఇనుము రక్తవృద్ధిని కలిగిస్తుంది. ఫలితంగా మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి కేశాలు పెరగడమే కాకుండా చుండ్రు సమస్యా తగ్గుతుంది.
* జుట్టు ఆరోగ్యంగా తేమతో నిగనిగలాడాలంటే… కొబ్బరినూనెను క్రమం తప్పకుండా రాసుకోవాలి. ఇది జుట్టు రాలకుండా, చివర్లు చిట్లకుండా చేస్తుంది.
* శీకాయ, కుంకుడుకాయలు… ఇవి చక్కటి క్లెన్సర్లుగా పనిచేసి జుట్టును శుభ్రపరుస్తాయి. వీటిలోని విటమిన్-ఎ, కె, సి, డి విటమిన్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.