చెక్కతో తయారు చేసిన ఎడ్లబండి, కుర్చీల్లాంటి అనేక రకాల వస్తువులను మనం చూస్తుంటాం. అయితే పంజాబ్‌కు చెందిన గురుచరణ్‌సింగ్ వినూత్నంగా చెక్కతో సైకిల్‌ను తయారు చేశారు. చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ సైకిల్ తొక్కడానికి సౌకర్యవంతంగా ఉంటుందని గురుచరణ్ చెబుతున్నారు. 1990 నుంచి ఆయన చెక్క పరికరాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ కుర్చీలు, బల్లలు, మొక్కల్ని పెంచే కుండీలు వంటి వాటిని ఆయన తయారు చేశారు. తాజాగా గురుచరణ్ సింగ్ తయారు చేసిన చెక్క సైకిల్ నెట్టింట వైరల్ అయింది.
ఇది చండీగఢ్ చెక్క సైకిల్
Related tags :