Food

పరగడుపున పరపర కరివేపాకు నమిలితే

Chewing Curry Leaves On Empty Stomach Has These Benefits

కరివేపాకు తెలియని వారుండరు. ఏ వంటకాలలో అయినా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. ఆహారానికి అంత రుచిని అందిస్తున్న కరివేపాకును మాత్రం తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇది కూరలో కనిపిస్తే అందరూ ఏరి పారేస్తారు. అయితే ఈ ఆకుల వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లూ , బి విటమిన్‌, కెరోటీన్‌ పుష్కలంగా ఉంటాయి.. అంతే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో నమిలితే బరువు తగ్గడం, జుట్టు పెరగడం, జీర్జ వ్యవస్థ మెరుగు పడటం వటి అద్భుత ఫలితాలను పొందవచ్చు. కరివేపాకును చిన్న చిన్న మార్పులతో తీసుకుంటే మన రోజువారీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఉదయం పూట లేవగానే కొన్ని కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మానవ శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య ఫలితాలను అందిస్తోంది. కాకపోతే దీనికి కాస్తా అవగాహన ఉంటే చాలు.

1. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
కరివేపాకు మీ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. ఉదయం ఒక గ్లాస్‌ నీటిని తాగండి. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని తాజా కరివేపాకులను నమలండి. ఆకులను సరిగ్గా నమలాలి. ఇలా చేసాకా కనీసం అరగంట తర్వాతే టిఫిన్‌ చేయాలి. అలాగే కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే కురులు ఆరోగ్యంగా, నల్లగా మెరుస్తాయి.

2. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవడం ముఖ్యంగా జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఇవి తినేటప్పుడు జీర్జ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అలాగే పేగు కదలికకు. మలబద్దం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

3. ఆనారోగ్య బారీ నుంచి తప్పిస్తోంది.
ఉదయం పూట కరివేపాకు తీసుకోవడం వల్ల అనారోగ్యం, వాంతులను తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ సమస్యలను రూపుమాపడంలో జీర్జక్రీయను మెరుగుపరుస్తుంది.

4. బరువు తగ్గడంలో దోహదం
కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గించే అనేక అంశాలకు సహకరిస్తుంది. మంచి జీర్ణక్రీయ. కొలెస్ట్రాల్‌ స్థాయిని మెరుగుపరుస్తుంది. కావున ఇక నంచి ‘కూరలో కరివేపాకులా తీసి పారేశారు’ అనే సామెతాలా.. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్న చూపు చూడకుండా రోజూ ఏదో ఒక విధంగా కరివేపాకును ఉపయోగించండి. మరి ఇప్పటికైనా కూరల్లో కర్వేపాకును వేరేయకుండా.. ఎంచక్కా తినేసేయండి.