NRI-NRT

మలేషియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

KCR Birthday Celebrated In Malaysia By NRI TRS

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అపర భగీరథుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్బంగా తెరాస ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఫ్రీ ట్రీ సొసైటీ వారి ఆధ్వర్యంలో నడుపుతున్న నర్సరీ కి నాటింగమ్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ప్లాంటేషన్ కి వెయ్యి మొక్కలను సిద్ధం చేసి మన సందర్శనకు గుర్తుగా నర్సరీ ముందు ఒక వేప మొక్కను నాటడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో బాగంగా లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం అసోసియేషన్ ని సందర్శించి అక్కడి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుర్మ మారుతి, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి మరియు ఇతర సభ్యులు ముల్కల శ్రీనివాస్ , శ్యామ్ రాజారామ్, హేమంత్ సాయి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.