కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలు తెరాస ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ “మహానేతకు మొక్క కానుక” పిలుపు మేరకు, తెరాస ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనల మేరకు సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బంగారు తెలంగాణ వైపు బాటలు వేయిస్తున్న కేసీఆర్ త్వరలో ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటించాలి అని వీరు ఆశించారు. సరోజ భాను, గంగాధర్, సురేష్ గౌడ్, దివ్య రవి గరినే, రవి గన్నరపు, కొండల్ రెడ్డి, రవి సుధగాని, జగదీశ్, అయ్యప్ప, గణేష్ మన్నే తదితరులు పాల్గొన్నారు.
కువైట్‌లో కేసీఆర్ 66వ జన్మదిన సంబురాలు
Related tags :