వినియోగదారుడి శ్రేయస్సే తనకు ముఖ్యమంటూ వినూత్న పద్ధతిలో ఓ మటన్ వ్యాపారి కొత్త తరహా వ్యాపారం మొదలుపెట్టాడు. రోడ్డు ప్రమాదాలు జరిగినా తన వినియోగదారుల ప్రాణాలకు ఎలాంటి ఆపదా రాకూడదంటూ తనదైన శైలిలో వ్యాపారం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు అనే మటన్ వ్యాపారి తన వద్ద 5 కేజీల మటన్ కొనుగోలు చేస్తే ఒక హెల్మెట్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేస్తున్నాడు. కేజీ మటన్ ధర రూ. 600 కాగా 5 కేజీలు కొన్నవారికి రూ. 600 విలువైన హెల్మెట్‌ను ఉచితంగా ఇస్తున్నాడు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తన వినియోగదారులకు ఏం కాకూడదనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. తద్వారా తన వ్యాపారం అభివృద్ధి చెందుతోందని అంటున్నాడు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. తన వద్ద మటన్ కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు వారి ఇంటి నుంచే స్టీల్ బాక్స్‌లు తీసుకొచ్చినట్లయితే కేజీకి రూ.20 చొప్పున తగ్గిస్తానని చెబుతున్నాడు.
మటన్ కొంటే…హెల్మెట్ ఉచితం
Related tags :