ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ ఏడాది కూడా వేడుకగా జరుగుతోంది. పలువురు సినీ, క్రీడారంగానికి చెందిన సెలబ్రెటీలు.. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంపుపై హొయలొలికించారు. ఆదివారంతో ముగియనున్న ఈ ఫ్యాషన్ వీక్‌లో తాజాగా ప్రముఖ నటి టబు, బిపాసా దంపతులు, డయానా పెంటీ, నోరా ఫతెహీ ర్యాంపు వాక్ చేశారు. క్రికెటర్ శిఖర్ ధావన్ సైతం తనదైన స్టైల్‌లో ర్యాంపుపై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ల్యాక్మే ఫ్యాషన్ వీక్‌లో టబు సొగసులు
Related tags :