Devotional

తిరుమల మెట్ల మార్గంలో చిరుత దాడి

Leopard Attacks In Tirumala Steps Way

తిరుమలలో చిరుతపులి కలకలం రేపింది. సోమవారం శ్రీవారి మెట్ల మార్గంలోని 270వ మెట్టు వద్ద దుప్పి కళేబరం, రక్తపు మరకలు కనిపించండంతో భక్తులు షాక్ తిన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో.. విజిలెన్స్, అటవీ సిబ్బంది చేరుకొని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుప్పి కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించి మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. దుప్పి శరీరంతో గాయాలు, గాట్ల ఆధారంగా చిరుతపులి దాడి చేసిందని నిర్ధారణకు వచ్చారు. ముందుజాగ్రత్తగా ఆ మార్గంలో కొద్దిసేపు భక్తులను అనుమతించలేదు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు మార్గాలుంటాయి. ఒకటి అలిపిరి మార్గం కాగా. మరొకటి శ్రీవారి మెట్టుమార్గం. అలిపిరి మార్గం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. శ్రీవారి మార్గాన్ని మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. ఆ మార్గంలో రాత్రివేళలో భక్తులను అనుమతించరు. ఉదయం 6 తర్వాతే కొండపైకి అనుమతిస్తారు. ఐతే చిరుతపులి సంచారం నేపథ్యంలో ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు. మెట్లమార్గంలో చిరుత సంచరిస్తుందని తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.