తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 66వ జన్మదినోత్సవాన్ని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ నాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల అభివృద్ధికై ఆహార్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందని అన్నారు. గల్ఫ్ లో పర్యటించి తానే స్వయంగా సమస్యలను పరిష్కరిస్తాననడం కేసీఆర్ శ్రద్ధను తెలుపుతోందని అన్నారు. జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, మగ్గిడి రాజేందర్, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్, దేవన్న బాల్కొండ, ఉత్కం కిరణ్ కుమార్, ప్రమోద్ బొలిశెట్టి, కొత్తూరు సాయన్న, రాజుకుమార్ కుమ్మరి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
బెహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదినోత్సవం
Related tags :