Movies

ప్రామిస్…మంచి కథలు ఎంచుకుంటాను

Aishwarya Menon On Her Story Choices

‘మిర్చి’ శివకు జోడీగా ‘తమిళ్‌పడం 2’లో నటించిన ముద్దుగుమ్మ ఐశ్వర్యా మేనన్‌. ఆ తర్వాత తాజాగా హిప్‌హాప్‌ ఆదితో కలిసి ‘నాన్‌ సిరిత్తాల్‌’తో నటించింది. ఇందులోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సందర్భంగా తన చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ ‘‘నాన్‌ సిరిత్తాల్‌’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. ప్రతి విషయానికి నవ్వే సమస్య ఉన్న యువకుడి కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. యువత నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తమిళంలో మరిన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకోవాలన్నదే నా కల. ఇక్కడి సినిమాలు కథానాయికగా గుర్తింపును తీసుకురావడంతో పాటు.. మనలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తాయి. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నా. కన్నడ, మలయాళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. మంచి కథలను ఎంచుకుని నటిస్తానని’ పేర్కొంది.